
ఆర్. కృష్ణయ్య
సాక్షి, పెద్దపల్లి : చట్టసభల్లో బీసీలకు తగిన స్థానాలు లేవని, రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బీసీలకు సముచిత స్థానం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
బీసీ సంఘాల ఫెడరేషన్లకు బడ్జెట్‌లో రూ.500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు కేటాయించాలని కోరారు. బీసీ కార్పొరేషన్‌కు రూ. 2 వేల కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ. 2 వేల కోట్ల నిధులు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ పథకం కింద బీసీలకు రూ. 2 లక్షలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment