
సాక్షి, హైదరాబాద్: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు అంశాన్ని తప్పకుండా లేవనెత్తుతామని ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నేతృత్వంలోని బృందం అఖిలేశ్‌ను కలిశారు. చట్టసభలు, ఉద్యోగ పదోన్నతులు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అఖిలేశ్‌ను కోరారు. బీసీల వాదన సరైందని, వచ్చే సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని అఖిలేశ్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment