ధర్నాలో కృష్ణయ్య, కోదండరాం
హైదరాబాద్: టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి 18 నెలలు గడి చినా ఇప్పటివరకు తుది ఫలితాలు ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో టీఎస్‌పీఎస్సీ చెలగాటం ఆడుతోందని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. వారం రోజుల్లోగా టీచర్ పోస్టుల తుది ఫలితాలు ప్రకటించాలని, లేదంటే వేలాది మంది నిరుద్యోగులతో ప్రగతిభవన్‌ను ముట్టడిస్తా మని హెచ్చరించారు. టీఆర్టీ నోటిఫికేషన్ భర్తీలో జరుగుతున్న జాప్యా న్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం, టీఆర్టీ నిరుద్యోగుల ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు.
టీజేఎస్ అధ్య క్షుడు కోదండరాం, మాజీ మంత్రి చిన్నారెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి తదితరు లు మద్దతు ప్రకటించారు. కృష్ణయ్య మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీ 8,786 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయ గా 4 నెలల్లో పూర్తి కావాల్సిన రిక్రూట్‌మెంట్ ప్రక్రియ 18 నెలలైనా పూర్తి కావడంలేదన్నారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు, టీచ ర్లు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నార న్నారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, జెట్టి మల్లికార్జున గౌడ్, భూపేష్‌సాగర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment