Teacher Post replacement
-
అర్హులైన టీచర్లకు మెసేజ్‌లు పంపండి: మంత్రి సబిత
సాక్షి, హైదరాబాద్: టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను న్యాయస్థానం తీర్పుకు లోబడి నిర్వహించాలని మంత్రి సబిత ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. బదిలీకి అర్హత గల ప్రతి ఉపాధ్యాయుడికీ బదిలీల సమాచారం అందించాలని సూచించారు. ఈ మేరకు దరఖాస్తు చేసుకోవలసిందిగా ప్రతి ఒక్కరికీ మెసేజ్‌లు పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో గురువారం ఎస్సీఈఅర్టీ కార్యాలయంలో ఆమె అధికారులతో సమావేశమయ్యారు. పారదర్శకతతో ఎలాంటి అపోహలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు. వెంటనే సంబంధిత విధివిధానాలు రూపొందించాలని సూచించారు. ఆన్లైన్ ప్రక్రియలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బదిలీల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రస్థాయి అధికారులను జిల్లాల్లో పర్యవేక్షకులుగా నియమించాలని సూచించారు. సమావేశంలో పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు. పదోన్నతుల తర్వాత ఖాళీల భర్తీ పదోన్నతులు, ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) పూర్తయిన తర్వాత విద్యాశాఖలో ఉండే ఇతర ఖాళీలను భర్తీ చేస్తామని సమావేశానంతరం మంత్రి మీడియాకు తెలిపారు. టీచర్ పోస్టుల భర్తీకి కొంతమంది అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ ఖాళీల్లో గెజిటెడ్ హెడ్ మాస్టర్, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులను, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయతి్నస్తున్నదని, ఈ సమయంలో అన్ని పారీ్టలు, అన్ని వర్గాలు సహకరించాలని మంత్రి కోరారు. ఇది కూడా చదవండి: నెల రోజుల్లోనే బదిలీలు, పదోన్నతులు -
మోడల్ స్కూళ్లలో 282 టీచర్ పోస్టుల భర్తీ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) 282 ఖాళీ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పోస్టుల భర్తీతో మోడల్ స్కూళ్లలో ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల కొరత తీరనుంది. వీటిల్లో 211 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 71 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ) పోస్టులున్నాయి. ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేపట్టింది. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు, అనుభవం లాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని మెరిట్ అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే మోడల్ స్కూళ్లలో గెస్టు ఫ్యాకల్టీగా పనిచేస్తున్న పార్ట్‌టైమ్ టీచర్లకు పోస్టుల భర్తీలో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సీట్లకు పెరిగిన డిమాండ్ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా 2009లో మోడల్ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 355 స్కూళ్లు ఏర్పాటు కాగా విభజన అనంతరం ఏపీకి 164 స్కూళ్లు కేటాయించారు. వీటిల్లో మొత్తం 91,520 సీట్లు అందుబాటులో ఉండగా 65,600 సెకండరీ ఎడ్యుకేషన్, 25,920 ఇంటర్ విద్యకు సంబంధించినవి ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులతో ఇంటర్ బోధన కొనసాగుతోంది. ప్రారంభంలో ఈ స్కూళ్లలో చేరికలు తక్కువగా ఉండగా ఇప్పుడు సీట్లకు డిమాండ్ పెరిగింది. డీఎస్సీ ద్వారా ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ పోస్టులు కొంతమేర భర్తీ అయ్యాయి. ఇంకా 565 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. వీటిలో 282 పోస్టులను ప్రస్తుతం భర్తీ చేయనున్నారు. -
వారంలోగా తుది ఫలితాలు ప్రకటించాలి
హైదరాబాద్: టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి 18 నెలలు గడి చినా ఇప్పటివరకు తుది ఫలితాలు ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో టీఎస్పీఎస్సీ చెలగాటం ఆడుతోందని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. వారం రోజుల్లోగా టీచర్ పోస్టుల తుది ఫలితాలు ప్రకటించాలని, లేదంటే వేలాది మంది నిరుద్యోగులతో ప్రగతిభవన్‌ను ముట్టడిస్తా మని హెచ్చరించారు. టీఆర్టీ నోటిఫికేషన్ భర్తీలో జరుగుతున్న జాప్యా న్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం, టీఆర్టీ నిరుద్యోగుల ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. టీజేఎస్ అధ్య క్షుడు కోదండరాం, మాజీ మంత్రి చిన్నారెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి తదితరు లు మద్దతు ప్రకటించారు. కృష్ణయ్య మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ 8,786 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయ గా 4 నెలల్లో పూర్తి కావాల్సిన రిక్రూట్మెంట్ ప్రక్రియ 18 నెలలైనా పూర్తి కావడంలేదన్నారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు, టీచ ర్లు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నార న్నారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, జెట్టి మల్లికార్జున గౌడ్, భూపేష్సాగర్ పాల్గొన్నారు. -
గట్టులో టీచర్లను నియమించండి
సాక్షి, హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న కొన్ని పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేడని, మండలానికి 218 పోస్టులను మంజూరు చేయగా కేవలం 54 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని చెప్పారు. -
2014 తర్వాత డిగ్రీలు చెల్లవు!
పలు తత్సమాన కోర్సులపై కేంద్ర ఉత్తర్వులు - అప్పట్లోనే మార్గదర్శకాలు జారీ.. ఆలస్యంగా వెలుగులోకి.. - టీచర్ పోస్టుల భర్తీ నేపథ్యంలో ఢిల్లీ నుంచి తెప్పించిన విద్యాశాఖ - 129 డిగ్రీలే చెల్లుబాటు.. 2014 తర్వాత వేరే పేర్లతో ఉంటే చెల్లవు - 16 రకాల డిగ్రీ తత్సమాన కోర్సులు చెల్లవని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: తెలుగు పండిత శిక్షణ, ఉర్దూ పండిత శిక్షణ, హిందీ పండిత శిక్షణ... రాష్ట్రంలో ఇటీవలి వరకు కొనసాగిన ఉపాధ్యాయ విద్యా కోర్సులివి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కానీ 2014లో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం.. 2014 తరువాత ఆ కోర్సులేవీ చెల్లుబాటు కావు. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవి పనికిరావు. ఆ కోర్సులను 2014కు ముందు చేసి, అది కూడా ఎన్సీటీఈ గుర్తింపు కలిగి ఉంటే మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఇవేకాదు డిగ్రీతో తత్సమానంగా పేర్కొంటున్న మరో 16 రకాల కోర్సులు కూడా చెల్లుబాటు కావు. ఈ కోర్సులను కూడా 2014కు ముందు చేసి, అప్పట్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు ఇచ్చిన డిగ్రీల జాబితాలో ఉంటే మాత్రమే ప్రస్తుతం ఉద్యోగ దరఖాస్తులకు చెల్లుబాటవుతాయి. 2014 తర్వాత దేశవ్యాప్తంగా డిగ్రీలన్నీ ఒకేరకంగా ఉండాలని అప్పట్లోనే యూజీసీ స్పష్టం చేసింది. మొత్తంగా 129 రకాల డిగ్రీలు మాత్రమే ఉండాలని, ఈ మేరకు అవసరమైన మార్పులు చేసుకోవాలని విద్యా సంస్థలను ఆదేశించింది కూడా. విద్యాశాఖ చొరవతో వెలుగులోకి.. రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అభ్యర్థులు కొత్త కొత్త పేర్లతో డిగ్రీ తత్సమాన సర్టిఫికెట్లు అంటూ దరఖాస్తు చేస్తున్నారు. అవి సరైన డిగ్రీలా, కాదా? అన్న సందేహం తలెత్తింది. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఒకేరకమైన డిగ్రీలు ఉండాలంటూ 2014 జూలై 11న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ వెబ్సైట్లో అందుబాటులో లేకపోవడంతో ఏయే డిగ్రీలకు గుర్తింపు ఉందన్న సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా కోర్సులపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) నుంచి స్పష్టత తీసుకురావాలని అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. దాంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దీనిపై విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యను, పాఠశాల విద్య డైరెక్టర్ కిషన్‌ను, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జగన్నాథరెడ్డిని కలిశారు. వాస్తవానికి ఈ అంశాన్ని తేల్చాల్సింది ఉన్నత విద్యా మండలి. అయినా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జగన్నాథరెడ్డి, ఇతర అధికారులు ఢిల్లీ వెళ్లి.. తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల్లో డిగ్రీతో తత్సమానంగా పేర్కొంటూ నిర్వహిస్తున్న పలు కోర్సులను యూజీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ కోర్సుల్లో 16 డిగ్రీలకు యూజీసీ గుర్తింపు లేదని, అవి చెల్లవని అధికారులు తేల్చారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన మరో 7 రకాల డిగ్రీలపై సందేహాలు ఉన్నాయని, దీనిపై ఆయా రాష్ట్రాలతో మాట్లాడి త్వరలో స్పష్టత ఇస్తామని తెలిపారు. యూనివర్సిటీలకే తెలియని పరిస్థితి! డిగ్రీల విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరముందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వివిధ యూనివర్సిటీలకే యూజీసీ మార్గదర్శకాలు, డిగ్రీల విషయంలో స్పష్టమైన అవగాహన లేదని.. దాంతో పాత పేర్లతోనే డిగ్రీలు ప్రదానం చేస్తున్నాయని చెబుతున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వెళ్లే విద్యార్థులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. 2014 నుంచి ఒకే రకమైన డిగ్రీలు ఉండాలన్న మార్గదర్శకాలకు అనుగుణంగా డిగ్రీల పేర్లను మార్చాల్సి ఉందని పేర్కొంటున్నాయి.