సాక్షి, హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న కొన్ని పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేడని, మండలానికి 218 పోస్టులను మంజూరు చేయగా కేవలం 54 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment