గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు సంబంధించి కేసులో టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్యను సిట్ విచారించింది. బుధవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నార్సింగి పోలీస్‌స్టేషన్ కు కృష్ణయ్యను పిలిపించిన అధికారులు.. దాదాపు 55 నిమిషాల పాటు ఆయనను ప్రశ్నించారు. నయీమ్‌తో సంబంధాలపై ఆరా తీశారు. అయితే నయీమ్ వ్యవహారంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ సహా ఎంతో మంది రాజకీయ నాయకులపై ఆరోపణలు వచ్చినా.. పోలీసులు ఎవరినీ పిలిపించిన దాఖలాలు లేవు. ఈ కేసులో తొలిసారిగా ఓ రాజకీయ నేతను పిలిచి ప్రశ్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది.