గ్యాంగ్ స్టర్ నయీం నేర కార్యకలాపాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వం ప్రచారం కోసమే తనను ఈ కేసులోకి లాగిందన్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఆయన విచారణ హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... పత్రికల్లో తాను మాట్లాడిన అంశాలపైనే తనను పోలీసులు పశ్నించినట్టు చెప్పారు.