
పదోన్నతుల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి
బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందుకోసం బీసీ ఉద్యో గులంతా సంఘటితంగా ఉద్యమించాలని పిలపునిచ్చారు. బీసీ సంక్షేమ భవన్‌లో బుధవారం జరిగిన బీసీ ప్రభుత్వ ఉద్యోగుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. దేశవ్యాప్తంగా బీసీ ఉద్యోగులు ఐదు లక్షలకు పైగా ఉన్నారని, వారందరూ ఉద్యమంలో పాల్గొనేలా చైతన్యపర్చాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, నిరంజన్, లక్ష్మినారాయణ, జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.