హైదరాబాద్: ఇటీవల జరిగిన కానిస్టేబుల్ రాతపరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ 30 గ్రేస్ మార్కులు కలపాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఔటాఫ్ సిలబస్ నుంచి ప్రశ్నలు అడిగారని
, కొన్ని ప్రశ్నలు తప్పుగా వచ్చాయని ఆరోపించారు. బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల సం«ఘం గురువారం నిర్వహించిన రాష్ట్ర సదస్సులో కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. ప్రశ్నలు తప్పుగా రావటం వల్ల పరీక్షకు హాజరైన అభ్యర్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని, ఎక్కువ మార్కులు సాధించలేక మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డా్డరని తెలిపారు.
తెలుగు మీడియం అభ్యర్థులకు ఈ రాత పరీక్ష మరింత భారమైందన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లపు కృష్ణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, రామలింగం, ప్రొఫెసర్ పీఎల్.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment