హైదరాబాద్: సర్పంచులది ఆకలి పోరాటం కాదని, ఆత్మగౌరవ పోరాటమని వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎమ్మెల్యేలు ఎన్‌వీఎస్‌ఎస్. ప్రభాకర్, ఆర్.కృష్ణయ్యలు అన్నారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ర్ట పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
సర్పంచుల సంఘం అధ్యక్షుడు మల్లేపల్లి సోమిరెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ప్రభాకర్, కృష్ణయ్యలు మాట్లాడుతూ సర్పంచులకు కనీస గౌరవ వేతనం రూ. 20వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి ఓటు హక్కు కల్పించాలని, ఆదాయంలో 42 శాతం పంచాయతీలకు కేటాయించాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు జాయింట్ చెక్‌పవ ర్‌ను తీసివేసి, నిధుల వినియోగంలో సర్పంచులకు స్వేచ్చ కల్పించాలని వారు కోరారు.
‘సర్పంచులది ఆత్మగౌరవ పోరాటం’
Published Mon, Mar 2 2015 4:32 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM
Advertisement
Advertisement