‘మోదీ’ హయాంలోనే హక్కులు సాధించుకుందాం | R. Krishnaiah comments in the LIC OBC employees welfare society meet | Sakshi
Sakshi News home page

‘మోదీ’ హయాంలోనే హక్కులు సాధించుకుందాం

Published Mon, Aug 21 2017 2:26 AM | Last Updated on Sun, Sep 17 2017 5:45 PM

‘మోదీ’ హయాంలోనే హక్కులు సాధించుకుందాం

‘మోదీ’ హయాంలోనే హక్కులు సాధించుకుందాం

బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య
 
హన్మకొండ: ప్రధాని నరేంద్రమోదీ హయాంలోనే బీసీ హక్కులను సాధించుకుందామని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య అన్నారు. ఆదివారం హన్మకొండలో జరిగిన ఎల్‌ఐసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓబీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని, ఉద్యోగాల నియామకం చేపట్టాలని, క్రిమిలేయర్‌ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఇటీవల ప్రధానిని కలసి విజ్ఞప్తి చేశానని చెప్పారు. ఎల్‌ఐసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

ఓబీసీ మేధావులు మౌనంగా ఉండడం వల్లే∙జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు చట్టసభల్లోకి వెళ్లలేక పోతున్నామని, తద్వారా కాంట్రాక్టర్లు, రౌడీలు, గూండాలు, పారిశ్రామిక వేత్తలు చట్టసభల్లో అడుగుపెడుతున్నారన్నారు. ఎల్‌ఐసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కమలాకర్‌ మాట్లాడుతూ ఎల్‌ఐసీ ఉద్యోగుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీ యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement