
సీతమ్మధార (విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఉన్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యను పదవి నుంచి తొలగించాలని బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిర్ణయించింది. ఆయన స్థానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏ రాజకీయ పార్టీకి చెందని వ్యక్తిని నియమించాలని తీర్మానించింది. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు పోలాకి శ్రీనివాసరావు అధ్యక్షతన విశాఖలోని ఇంజనీరింగ్ గెస్ట్‌హౌస్‌లో బుధవారం జరిగిన రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘం గౌరవాధ్యక్షుడిగా ఆర్.కృష్ణయ్యను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆర్. కృష్ణయ్య హైదరాబాద్‌లోని ఎబీ నగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment