మాజీ ప్రధాని దేవెగౌడతో బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మంగళవారం ఇక్కడ భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని దేవెగౌడతో బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మంగళవారం ఇక్కడ భేటీ అయ్యారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
బీసీలను నామినేటెడ్ సభ్యులుగా నియమించేందుకు రాజ్యాంగ సవరణ చేసి 20 శాతం అదనపు సీట్లను సృష్టించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరితో కృష్ణయ్య సుదీర్ఘంగా చర్చించారు.