పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలి: ఆర్‌.కృష్ణయ్య | Should be BC bill in parliament: krishnaiah | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలి: ఆర్‌.కృష్ణయ్య

Published Thu, Apr 20 2017 1:21 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలి: ఆర్‌.కృష్ణయ్య - Sakshi

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలి: ఆర్‌.కృష్ణయ్య

సాక్షి. హైదరాబాద్‌: పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బుధవారం సచివాలయం మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్‌ చేశారు.

పంచాయతీ రాజ్‌ సంస్థలో బీసీల రిజర్వేషన్లను 34% నుంచి 50 శాతానికి పెంచాలని సూచించారు. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌ను తొలగించాలన్నారు. బీసీలకు రాజ్యాంగ బద్ధమైన హక్కులు కల్పించాలని ఈ నెల 21న హైదరాబాద్‌ ఆర్టీసీ కళాభవన్‌లో మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement