ప్రభుత్వానికి ఆర్.కృష్ణయ్య ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలోని 9 బీసీ ఫెడ రేషన్లతోపాటు బీసీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించలేదు. ఫెడరేషన్లు ఉన్నట్టా, రద్దయినట్లా’ అని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. సంక్షేమ శాఖల బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా శుక్రవారం శాసనసభలో మాట్లాడారు. భారీగా రాను న్న ఉద్యోగ ప్రకటనలను దృష్టిలో పెట్టు కుని బీసీ స్టడీ సర్కిల్‌కు కేటాయింపులను రూ.14 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచాలని కోరారు.
మార్క్సిస్టులు అంటే సమానత్వాన్ని కోరేవారని, తాము గులాబీ మార్క్సిస్టులమని టీఆర్‌ఎస్ సభ్యుడు రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఎస్టీల్లో కొత్త కులాలు చేర్చవద్దని, ఇప్పటికే కోయ, లం బాడీలు తన్నుకుచస్తున్నారని సీపీఎం సభ్యు డు సున్నం రాజయ్య పేర్కొన్నారు. ఎస్టీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని కోరారు. గిరి జనులకు ఒక్క అంగుళం కూడా భూ పంపి ణీ చేయలేదన్నారు. రాష్ట్రంలో వక్ఫ్ భూము లు దురాక్రమణలకు గురవుతున్నా రెవెన్యూ శాఖ పట్టించుకోవడం లేదని ఎంఐఎం సభ్యుడు మౌజం ఖాన్ ఆరోపించారు.
బీసీ ఫెడరేషన్లు రద్దు చేశారా?
Published Sat, Mar 25 2017 3:28 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
Advertisement