BC Federation
-
‘పవన్ పార్ట్ టైమ్ లీడర్‌గా మారారు’
సాక్షి, విజయవాడ : అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 80 శాతం అమలు చేశారని బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బుద్దా నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ 2014ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తిగా విషలమైందని విమర్శించారు. రాష్ట్రంలో 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చి యువతకు సీఎం జగన్ భరోసా కల్పించారన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఆనాడు వైయస్సార్‌ది అయితే ఈనాడు రాష్ట్ర రైతులు ఆర్ధికంగా నిలదొక్కుకునేలా రైతు భరోసా తెచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ రాషష్టట్రానికి అవసరమన్నారు. చంద్రబాబు ఒక్క హైదరాబాద్‌ను మాత్రమే అబివృద్ది చేయడంతోనే తెలంగాణ వాదం పుట్టిందని, రాష్ట్ర విభజనకు చంద్రబాబు లేఖ ఇవ్వలేదా అని ప్రశ్నించారు. (ఇక మధ్యాహ్న భోజన పథకంలో నూతన మెనూ) చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అంతా తాత్కాలికం అంటూ కాలయాపన చేశారని విమర్శించారు. కార్పోరేట్ కంపెనీలకు, తమ అనుకూల వర్గం కోసం ఇన్సైడ్ ట్రెడింగ్‌కు పాల్పడ్డారని మండిపడ్డారు. సీఎం జగన్ రైతు పక్షపాతి అని, రైతులకు అన్యాయం జరగనివ్వరని భరోసా ఇచ్చారు. చంద్రబాబు రాజకీయ నిరుద్యోగిగా మారీ అలజడి సృష్టిస్తున్నారని, చంద్రబాబు ఐదేళ్లలో అమరావతి అబివృద్ది చేయకపోగా రాషష్టట్రీఆన్ని అప్పుల ఉబిలో నెట్టారని దుయ్యబట్టారు. గడిచిన ఐదేళ్ల పాలనలో కార్పోరేట్లకు కొమ్ము కాసిన తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడ అనలేదన్నారు. తెలుగుదేశం బినామీ, షాడో పార్టీగా జనసేన వ్యవహరిస్తోందన్నారు. తెలుగుదేశం ముసుగులో పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిశారని ఆరోపించారు. సొంత వ్యక్తిత్వం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, పార్ట్ టైమ్ లీడర్‌గా ఆయన వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. -
‘మంత్రి వర్గ కూర్పు.. చరిత్రాత్మక నిర్ణయం’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ, సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని బీసీ జాతీయ ఫెడరేషన్ అధ్యక్షులు, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వీ ఈశ్వరయ్య కొనియాడారు. తరతరాల రాజకీయ వివక్షకు తెరదించేస్తూ బడుగు, బలహీనవర్గాలకు తన మంత్రివర్గంలో అగ్ర ప్రాధాన్యం కల్పించి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. బలహీనవర్గాల పట్ల జగన్ చిత్తశుద్ధి ఆయన్ను ఓ జాతీయ నాయకుడిగా చేసిందని ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ మంత్రివర్గంలో బీసీ వర్గానికి అగ్రస్థానం దక్కిన విషయం తెలిసిందే. ‘బీసీ–ఇ’వర్గానికి చెందిన ముస్లిం మైనార్టీతోపాటు బీసీలకు 8 మంత్రి పదవులు కేటాయించారు. తరువాత ఎస్సీలకు 5 మంత్రి పదవులు కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాపు, రెడ్డి సామాజి కవర్గాలకు చెరో నాలుగు మంత్రి పదవులు ఖరారు చేశారు. ఎస్టీ, కమ్మ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలకు ఒక్కోటి చొప్పున మంత్రి పదవులు ఇచ్చారు. ఇక బీసీల్లోనూ అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం విశేషం. ధర్మాన కృష్ణదాస్( పోలినాటి వెలమ), బొత్స సత్యన్నారాయణ(తూర్పు కాపు), పిల్లి సుభాష్ చంద్రబోస్ (శెట్టి బలిజ), మోపిదేవి వెంకటరమణ (మత్స్యకార), అనిల్ కుమార్‌యాదవ్ (యాదవ), గుమ్మనూరు జయరాం (బోయ), మాలగుండ్ల శంకరనారాయణ(కురబ) సామాజిక వర్గాలతోపాటు బీసీ–ఇ కేటగిరికీ చెందిన షేక్ అంజాద్ బాషా(ముస్లిం మైనార్టీ)కి తన మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. -
వైఎస్ జగన్‌కు బీసీ ఫెడరేషన్ వినతిపత్రం
-
బీసీ ఫెడరేషన్లలో అయోమయం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన కులాల (బీసీ) ఫెడరేషన్లలో అయోమయం నెలకొంది. 2018–19 వార్షిక సంవత్సరానికి దాదాపు రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ.. వాటిని ఎలా ఖర్చు చేయాలనే అంశంపై స్పష్టత కొరవడింది. మూడేళ్ల తర్వాత ఫెడరేషన్లకు సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ నేపథ్యంలో అధికారులు నూతనోత్సాహంతో పథకాల అమలుకు చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ.. భారీ స్థాయిలో వార్షిక ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. దరఖాస్తుల స్వీకరణ సైతం ఏప్రిల్ నెలాఖరుతో ముగిసింది. 11 ఫెడరేషన్లకు 2.21 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు స్వీకరణ పూర్తయి మూడున్నర నెలలు కావస్తున్నా అర్హుల ఎంపిక మాత్రం జరగలేదు. వాస్తవానికి ఫెడరేషన్లకు సంబంధించిన వార్షిక ప్రణాళిక ఖరారైతేనే జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్ణయించే వీలుంటుంది. ఈ క్రమంలో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి జిల్లాల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ 2018–19 వార్షిక సంవత్సరం ప్రారంభమై రెండో త్రైమాసికం ముగుస్తున్నా ఫెడరేషన్ల వార్షిక ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం తెలుపలేదు. దీంతో లబ్ధి దారుల ఎంపిక ఎక్కడికక్కడే నిలిచిపోయింది. పరిశీలనతో సరి.. బీసీ ఫెడరేషన్ల వారీగా వచ్చిన దరఖాస్తులను ప్రాథమిక కసరత్తులో భాగంగా అధికారులు పరిశీలించారు. ఇందులో భాగంగా దరఖాస్తులను పూరించిన మేరకు స్వయం ఉపాధి యూనిట్ బడ్జెట్ స్థాయిని బట్టి కేటగిరీల వారీగా విభజించారు. అయితే వివిధ ఫెడరేషన్లను నిర్ణయించిన బడ్జెట్లో ఏయే యూనిట్లకు అనుమతి ఇవ్వొచ్చనే అంశంపై స్పష్టత వస్తేనే కేటగిరీల వారీగా లబ్ధిదారులను గుర్తించవచ్చు. కానీ వార్షిక ప్రణాళికలకు ప్రభుత్వ ఆమోదం రాకపోవడంతో అధికారులు దరఖాస్తుల పరిశీలనకే పరిమితమయ్యారు. -
రుణాలు కొందరికే..!
ఆదిలాబాద్ రూరల్: ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో స్వయం ఉపాధి కింద ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం బీసీ ఫెడరేషన్లకు నిధులు మంజూరు చేసింది. వేలల్లో దరఖాస్తులు రాగా.. నిధులు అంతంత మాత్రంగానే విడుదల చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. జిల్లాలో గత డిసెంబర్ మాసం వరకు 139 వివిధ సొసైటీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫెడరేషన్ల కోసం వివిధ రకాల రుణాలు అందించేందుకు రూ.250 కోట్లు మంజూరు చేసింది. ఫెడరేషన్లు ఇవే.. జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఫెడరేషన్లను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ప్రభుత్వం వ్యక్తిగత రుణాలతోపాటు సొసైటీకి రుణాలు మంజూరు చేయనుంది. ప్రస్తుతం జిల్లాలో 139 సొసైటీలు రిజిస్టర్ చేసుకున్నాయి. ఇందులో వాషర్మెన్, కోఆపరేటీవ్ సొసైటీ, నాయీబ్రాహ్మణ సొసైటీ, వడ్డర సొసైటీ, సాగర(ఉప్పర), వాల్మీకి, బోయ, క్రిష్ణబలిజపోసాల, బట్రాజ్, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి శాలివాహన, నూర్‌బాషా, మేదర, టాడిటాపర్స్ కోఆపరేటీవ్ సొసైటీలు ఉన్నాయి. ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా ఆయా ఫెడరేషన్లకు సబ్సిడీపై రుణాలను అందజేయనుంది. వ్యక్తిగత రుణాలు రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు బ్యాంక్‌తో సంబంధం లేకుండా అందజేయనుంది. సొసైటీలకు బ్యాంక్ లింకేజీతో రుణాలను అందజేయనుంది. ఆయా రుణాలు కోసం 21 నుంచి 55 సంవత్సరాల వయస్సు నిండి ఉన్నవారికి వీటిని అందజేయడం జరుగుతుంది. వేలల్లో దరఖాస్తులు.. రాష్ట్ర ప్రభుత్వం ఫెడరేషన్లతోపాటు వ్యక్తిగత రుణాలను కలుపుకొని రూ.250 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయకపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో వేలాది సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. నిధులు అంతంత మాత్రంగానే ఉండడంతో కొంతమందికే రుణం అందే అవకాశం ఉంది. ప్రభుత్వం నిధులు పెంచి ఇతరులకు సైతం అవకాశం కలిగేలా చూడాలని కోరుతున్నారు. -
ఆర్టీసీ నష్టాల భారం ప్రజలపైనే!
-
ఆర్టీసీ నష్టాల భారం ప్రజలపైనే!
సాక్షి, అమరావతి: ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతే అంతిమంగా ఆ భారం ప్రజలపైనే పడుతుందని సీఎం చంద్ర బాబు స్పష్టం చేశారు. ఆర్టీసీ నష్టాలు ప్రస్తుతం రూ.795 కోట్లకు చేరాయని, ఇప్పటికైనా సవాల్‌గా తీసుకొని నష్ట నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొం దించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని సీఎం ఆదేశించారు. గురువారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడుతో కలసి ముఖ్యమంత్రి రవాణా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల్లో సీట్ల ఆక్యుపెన్సీ పెంచడంతో పాటు నాన్ టికెట్ రెవెన్యూ పెంచుకోవాలని సీఎం సూచించారు. కాగా, సుప్రీంకోర్టు మార్గదర్శ కాల ప్రకారం 21 మందితో జిల్లా స్థాయిలో, 18 మందితో రాష్ట్ర స్థాయిలో రహదారి భద్రత కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సిన అవసరముందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సంక్షేమ శాఖల పనితీరుపై సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. బీసీ ఫెడరేషన్లలో సమర్థం గా విధులు నిర్వర్తించిన వంద మందిని త్వరలో కలుస్తానని చెప్పారు. అలాగే కులవృత్తుల వదిలి వేరే వృత్తుల్లోకి మారిన వారి వివరాలు తయారుచేయాలని ఆదేశించారు. ఇక నేరుగా ఫిర్యాదు చేయొచ్చు.. ప్రజలు నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదులు, సూచనలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ప్రత్యేకం గా రూపొందించిన ‘కనెక్ట్ ఏపీ సీఎం’ యాప్‌ను సీఎం చంద్రబాబు శుక్రవారం ఆవిష్కరించనున్నారు. త్యాగానికి క్రీస్తు ప్రతీక: చంద్రబాబు శాంతి బోధనలతో ఏసుక్రీస్తు ప్రపంచాన్నే ప్రభావితం చేశారని, త్యాగానికి ఆయన ప్రతీక అని సీఎం చంద్ర బాబు పేర్కొన్నారు. క్రీస్తుకు శిలువ వేసిన రోజును గుడ్ ఫ్రైడేగా పాటిస్తున్నారని, ఇది ఎంతో పవిత్రమైన రోజు అని చెప్పారు. శాంతి, అహింసతోనే సమాజాభివృద్ధి సాధ్య మని, విశ్వమానవాళిని ప్రేమతో చూడాల న్నదే కరుణామయుని బోధనల సారమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
బీసీ ఫెడరేషన్లు రద్దు చేశారా?
ప్రభుత్వానికి ఆర్.కృష్ణయ్య ప్రశ్న సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలోని 9 బీసీ ఫెడ రేషన్లతోపాటు బీసీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించలేదు. ఫెడరేషన్లు ఉన్నట్టా, రద్దయినట్లా’ అని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. సంక్షేమ శాఖల బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా శుక్రవారం శాసనసభలో మాట్లాడారు. భారీగా రాను న్న ఉద్యోగ ప్రకటనలను దృష్టిలో పెట్టు కుని బీసీ స్టడీ సర్కిల్‌కు కేటాయింపులను రూ.14 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచాలని కోరారు. మార్క్సిస్టులు అంటే సమానత్వాన్ని కోరేవారని, తాము గులాబీ మార్క్సిస్టులమని టీఆర్ఎస్ సభ్యుడు రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఎస్టీల్లో కొత్త కులాలు చేర్చవద్దని, ఇప్పటికే కోయ, లం బాడీలు తన్నుకుచస్తున్నారని సీపీఎం సభ్యు డు సున్నం రాజయ్య పేర్కొన్నారు. ఎస్టీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని కోరారు. గిరి జనులకు ఒక్క అంగుళం కూడా భూ పంపి ణీ చేయలేదన్నారు. రాష్ట్రంలో వక్ఫ్ భూము లు దురాక్రమణలకు గురవుతున్నా రెవెన్యూ శాఖ పట్టించుకోవడం లేదని ఎంఐఎం సభ్యుడు మౌజం ఖాన్ ఆరోపించారు. -
మన వాళ్లు మొదలు పెట్టారు..
- సీఎం కాళ్లకు దండం పెట్టిన బీసీ ఫెడరేషన్ల నేతలు సాక్షి, అమరావతి తమిళ నాడులో రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఆ పార్టీ అధ్యక్షుల కాళ్లకు మొక్కడం, పొర్లుదండాలు పెట్టడం సహ జంగా చూస్తుంటాం.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడం. ఒకవేళ అభిమానం ఉన్నా నేతలను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడే చేస్తుంటారు. తాజాగా వేలాదిమంది వెనుకబడినవర్గాల ప్రజల సమక్షంలో బీసీ ఫెడరేషన్ల చైర్మన్లు సీఎం చంద్రబాబు కాళ్లకు దణ్ణం పెట్టారు. ఒకరిద్దరిని పైకి లేవదీసిన బాబు ఆపైన పట్టించుకోలేదు. నేతలే కాళ్లకు దణ్ణంపెట్టి లేచి వెళ్లారు. ఈ సంఘటన చూస్తున్న బీసీ వర్గాల ప్రజలు మాత్రం ఔరా అంటూ విస్తుబోయారు. ఈ ఘటన గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ సంఘాల ఫెడరేషన్స్ చైర్మన్ల ప్రమాణస్వీకార కార్యక్రమంలో జరిగింది. విశేషమేమంటే సీఎం వచ్చే వరకు వెనుకబడిన కులాలవారు ఎవరికీ తీసిపోమని, అన్ని రంగాల్లో చైతన్యవంతులయ్యామంటూ గొప్పలు చెప్పుకున్న నేతలే చంద్రబాబు రాగానే కాళ్లకు దణ్ణం పెట్టడంపై నేతలు పడే పాట్లు చూసి సభికులు నవ్వుకున్నారు. -
బీసీ ఫెడరేషన్లకు జవసత్వాలు!
♦ కులవృత్తుల ఆధునీకరణకు సర్కారు ప్రణాళికలు ♦ బీసీ సమాఖ్యలకు 70, 80 శాతం రాయితీతో రుణాలు ♦ వడ్డెర్లకు పొక్లెయిన్లు.. నాయి బ్రాహ్మణులకు బ్యూటిషియన్ కిట్ ♦ రజకులకు దోబీఘాట్లు, ఇతర సదుపాయాలు సాక్షి, హైదరాబాద్: బీసీ ఫెడరేషన్లకు జవసత్వాలు కల్పించేందుకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ ఫెడరేషన్లలోని ఆయా కులవృత్తులను ఆధునీకీకరించే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం మారుతున్న కాల, పరిస్థితులకు అనుగుణంగా కులవృత్తుల ద్వారా అందించే సేవలను ఆధునీకీకరించే చర్యలు చేపట్టనున్నారు. తద్వారా ఆయా వృత్తులవారు తగిన పారితోషకం, లబ్ధి పొందేలా మార్పులు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ ఫెడరేషన్లలోని ఒక్కో సభ్యుడికి రూ.లక్ష లేదా రెండు లక్షల చొప్పున (15 సభ్యులున్న గ్రూపునకు) రూ.15 లక్షలు లేదా రూ.30 లక్షలను 50 శాతం సబ్సిడీతో అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా, నూతన రాయితీ విధానంలో భాగంగా బీసీ కార్పొరేషన్ ద్వారా 2015-16 నుంచి రూ.లక్ష-10 లక్షల మధ్య 80-60 శాతం సబ్సిడీలతో రుణాలు ఇస్తున్నారు. అయితే ఫెడరేషన్లకు మాత్రం ఇంకా 50 శాతం సబ్సిడీతోనే రుణాలు ఇస్తున్నారు. కానీ వీటి ద్వారా ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదు. దాంతో వీటిని కూడా బలోపేతం చేయాలన్న ఆలోచనతో ఫెడరేషన్లకు ఇస్తున్న రుణాలకు రూ.లక్షకు 80 శాతం, రూ. రెండు లక్షలకు 70 శాతం సబ్సిడీ ఇచ్చేలా ప్రభుత్వానికి బీసీ సంక్షేమశాఖ ప్రతిపాదనలను సమర్పించింది. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం త్వరలోనే ఆమోదముద్ర వేయనున్నట్లు అధికారవర్గాల సమాచారం. ప్రస్తుతం రజక, నాయీ బ్రాహ్మణ, వడ్డెర, సగర (ఉప్పర), వాల్మీకి/బోయ, కృష్ణబలిజ-పూసల, భట్రాజు, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి/శాలివాహన, మేదర, కల్లు గీతకారులకు ఫెడరేషన్లు ఉన్నాయి. కొత్తగా 2016-17 ఏడాదిలో సంచారజాతుల సంక్షేమం కోసం రూ. ఐదు కోట్ల రూపాయలతో సంచారజాతుల సమాఖ్య లిమిటెడ్‌ను కూడా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వడ్డెర్లకు పొక్లెయిన్లు.. వడ్డెర్లు అనేక ప్రయాసలకు ఓర్చి కఠినతరమైన వృత్తిని నిర్వహిస్తుండడంతో వారి గ్రూపులకు పొక్లెయిన్లు వంటి వాటిని రుణాల ద్వారా అందజేయాలని నూతన ప్రణాళికలో భాగంగా ప్రతిపాదనలు సిద్ధంచేశారు. రజకవృత్తి ఆధునీకీకరణలో భాగంగా దోబీఘాట్ల నిర్మాణానికి బోరుబావి తవ్వకం, విద్యుత్ కనెక్షన్‌తో మోటారు అమరిక , నీటితొట్టి, షెడ్లనిర్మాణం, విశ్రాంతి గది, మరుగుదొడ్ల నిర్మాణం, డ్రైక్లీనింగ్ సామగ్రి వంటి వాటిని అందించనున్నారు. అలాగే నాయీ బ్రాహ్మణులకోసం మొబైల్ బ్యూటీషియన్‌కు అవసరమైన హంగులు సమకూర్చనున్నారు. వినియోగదారుల ఇంటివద్దనే సేవలు అందించేందుకు కావాల్సిన శిక్షణనిచ్చి ఒక ద్విచక్రవాహనం, బ్యూటీషియన్ కిట్, యాప్రాన్, ఫోన్ సమకూర్చి, వినియోగదారులు సంప్రదించేందుకు వీలుగా ఒక యాప్‌ను ఏర్పాటు చేస్తారు. దీనిలో భాగంగా పైలట్ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తాన్ని భరించేందుకు ఎస్ బ్యాంక్ సుముఖత వ్యక్తంచేసింది. ఇదే తరహాలో ఇతర వృత్తులను కూడా ఆధునీకీకరించి, ఆయా కులవృత్తుల వారు ఆర్థికాభివృద్ధిని సాధించేలా బీసీ శాఖ ప్రణాళికలకు తుదిరూపునిస్తోంది. -
విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి స్పీకర్ మధుసూదనాచారి
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని విశ్వబ్రాహ్మణులు ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఏపీలోని విశాఖలో నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఆయన బుధవారం తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో కలసి గాజువాకలోని ఏపీ రాష్ర్ట విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి నాగులకొండ ఆశ్లేషాచారి ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ కుల పెద్దలు, స్థానిక నాయకులు స్పీకర్‌ను సత్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని విశ్వబ్రాహ్మణులను ఐక్యం చేయడంతోపాటు వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ ఫెడరేషన్ ఏర్పాటుకు తాను కృషి చేస్తానని చెప్పారు. -
జనాభా ప్రాతిపదికన బీసీ ఫెడరేషన్లకు బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులలోని ఆయా కులాల్లో జనాభాను బట్టి బీసీ సహకార ఫెడరేషన్లకు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు జరుపనుంది. గతేడాది ఆగస్టు 19న సమగ్ర కుటుంబసర్వేలో ఆయా బీసీ కులాలకు సంబంధించి లెక్కలకు అనుగుణంగా ఆయా ఫెడరేషన్లకు 2015-16 బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడైన సమాచారం ప్రకారం రాష్ర్టంలో విశ్వబ్రాహ్మణ, అనుబంధకులాలు కలుపుకుని 9.5 లక్షల మంది, రజకుల సంఖ్య 8.5 లక్షలుగా తేలింది. ఇక ఇతర వెనుకబడిన కులాల వివరాల విషయానికి వస్తే వడ్డెరలు 3.75 లక్షలు, కుమ్మరి, శాలివాహన 3.70 లక్షలు, నాయి బ్రాహ్మణులు 3 లక్షలు, వాల్మీకి/బోయలు దాదాపు 3 లక్షలు, సగర (ఉప్పర) 1.20 లక్షలు, మేదర 91 వేలు, కృష్ణ బలిజ/పూసల 38 వేలు, భట్రాజ్లు 17 వేలు ఉన్నట్టు స్పష్టమైంది. ఈ పది కులాలకు సంబంధించిన సహకార ఫెడరేషన్లకు వచ్చే బడ్జెట్లో కేటాయింపులపై గతంలోనే కొంత కసరత్తు జరిగింది. ఆయా ఫెడరేషన్లకు బడ్జెట్ ప్రతిపాదనలు దాదాపు సిద్ధం చేశారు. అయితే ఆ తర్వాత సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడైన వివరాలకు అనుగుణంగా ఆయా కులాల లెక్కలు తీసి బడ్జెట్ ప్రతిపాదలను తాజాగా రూపొందించారు. మొత్తంగా చూస్తే ఈ కులాలకు సంబంధించిన పది సహకార ఫెడరేషన్లకు దాదాపు రూ.160-170 కోట్ల వర కు ప్రతిపాదించి ప్రభుత్వ పరిశీలనకు పంపించారు. ఆయా శాఖలవారీగా బడ్జెట్ కసరత్తు ముగిశాక, ఈ ప్రతిపాదనలకు కూడా తుదిరూపం ఇచ్చి వార్షిక బడ్జెట్లో పెట్టనున్నట్లు ప్రభుత్వవర్గాల సమాచారం.