సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ, సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని బీసీ జాతీయ ఫెడరేషన్ అధ్యక్షులు, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వీ ఈశ్వరయ్య కొనియాడారు. తరతరాల రాజకీయ వివక్షకు తెరదించేస్తూ బడుగు, బలహీనవర్గాలకు తన మంత్రివర్గంలో అగ్ర ప్రాధాన్యం కల్పించి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. బలహీనవర్గాల పట్ల జగన్ చిత్తశుద్ధి ఆయన్ను ఓ జాతీయ నాయకుడిగా చేసిందని ప్రశంసల వర్షం కురిపించారు.
జగన్ మంత్రివర్గంలో బీసీ వర్గానికి అగ్రస్థానం దక్కిన విషయం తెలిసిందే. ‘బీసీ–ఇ’వర్గానికి చెందిన ముస్లిం మైనార్టీతోపాటు బీసీలకు 8 మంత్రి పదవులు కేటాయించారు. తరువాత ఎస్సీలకు 5 మంత్రి పదవులు కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాపు, రెడ్డి సామాజి కవర్గాలకు చెరో నాలుగు మంత్రి పదవులు ఖరారు చేశారు. ఎస్టీ, కమ్మ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలకు ఒక్కోటి చొప్పున మంత్రి పదవులు ఇచ్చారు. ఇక బీసీల్లోనూ అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం విశేషం. ధర్మాన కృష్ణదాస్( పోలినాటి వెలమ), బొత్స సత్యన్నారాయణ(తూర్పు కాపు), పిల్లి సుభాష్ చంద్రబోస్ (శెట్టి బలిజ), మోపిదేవి వెంకటరమణ (మత్స్యకార), అనిల్ కుమార్‌యాదవ్ (యాదవ), గుమ్మనూరు జయరాం (బోయ), మాలగుండ్ల శంకరనారాయణ(కురబ) సామాజిక వర్గాలతోపాటు బీసీ–ఇ కేటగిరికీ చెందిన షేక్ అంజాద్ బాషా(ముస్లిం మైనార్టీ)కి తన మంత్రి వర్గంలో స్థానం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment