మన వాళ్లు మొదలు పెట్టారు.. | The inauguration ceremony of the BC Federation of Unions | Sakshi
Sakshi News home page

మన వాళ్లు మొదలు పెట్టారు..

Published Thu, Aug 4 2016 7:31 PM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM

The inauguration ceremony of the BC Federation of Unions

- సీఎం కాళ్లకు దండం పెట్టిన బీసీ ఫెడరేషన్ల నేతలు

సాక్షి, అమరావతి

 తమిళ నాడులో రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఆ పార్టీ అధ్యక్షుల కాళ్లకు మొక్కడం, పొర్లుదండాలు పెట్టడం సహ జంగా చూస్తుంటాం.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడం. ఒకవేళ అభిమానం ఉన్నా నేతలను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడే చేస్తుంటారు. తాజాగా వేలాదిమంది వెనుకబడినవర్గాల ప్రజల సమక్షంలో బీసీ ఫెడరేషన్ల చైర్మన్లు సీఎం చంద్రబాబు కాళ్లకు దణ్ణం పెట్టారు. ఒకరిద్దరిని పైకి లేవదీసిన బాబు ఆపైన పట్టించుకోలేదు.

 

నేతలే కాళ్లకు దణ్ణంపెట్టి లేచి వెళ్లారు. ఈ సంఘటన చూస్తున్న బీసీ వర్గాల ప్రజలు మాత్రం ఔరా అంటూ విస్తుబోయారు. ఈ ఘటన గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ సంఘాల ఫెడరేషన్స్ చైర్మన్ల ప్రమాణస్వీకార కార్యక్రమంలో జరిగింది. విశేషమేమంటే సీఎం వచ్చే వరకు వెనుకబడిన కులాలవారు ఎవరికీ తీసిపోమని, అన్ని రంగాల్లో చైతన్యవంతులయ్యామంటూ గొప్పలు చెప్పుకున్న నేతలే చంద్రబాబు రాగానే కాళ్లకు దణ్ణం పెట్టడంపై నేతలు పడే పాట్లు చూసి సభికులు నవ్వుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement