హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకపోతే ఉద్యమం తప్పదని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన నిరుద్యోగ గర్జనలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసం గించారు.
నిరుద్యోగ జాక్ అధ్యక్షుడు నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య మాట్లా డుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. 14 లక్షల మంది ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రూప్–1లో 1,200, గ్రూప్–3లో 8 వేలు, గ్రూప్–4లో 36 వేల క్లరికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకపోతే ఉద్యమం చేపట్టేందుకు సిద్ధం కావాలన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే హైదరాబాద్ దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పలువురు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment