Replace jobs
-
50 వేల ఉద్యోగాల భర్తీపై.. నేడే కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలి దశలో భర్తీ చేయాలని భావిస్తున్న 50 వేల ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలపై ఆర్థిక శాఖ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తోంది. అన్ని శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరై.. గతంలో ఇచ్చిన ఖాళీలపై మరోసారి తుది నిర్ధారణకు రానున్నారు. ఆదివారం శాఖల వారీగా భర్తీ చేయాల్సిన 50 వేల పోస్టులకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించి.. ఈనెల 13న సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశానికి సమర్పించనున్నారు. మొత్తం 22 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, ఆయా విభాగాల అధిపతులు ఈ సమావేశానికి పూర్తి వివరాలతో రావాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉదయం 10 గంటలకు పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, పౌరసరఫరాలు, వినియోగదారుల శా ఖ, అటవీ పర్యావరణ, సాంకేతిక శాఖలతో, 10.30 గంటలకు నీటిపారుదల శాఖ, కార్మిక, ఉపాధి కల్పన, హోం, న్యాయ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. 11 గంటలకు చట్టసభలు, పురపాలక, పట్టణాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక యువజన సర్వీసులు శాఖల అధికారులు, 11.30 గంటలకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం రెవెన్యూ విభాగాల అధికారులతో, 12 గంటలకు రవాణా, రహదారులు, భవనాల శాఖ, గృహ నిర్మాణం, సాధారణ పరిపాలన శాఖ అధికారులతో ఆర్థిక శాఖ అధికారులు సమావేశమవుతారు. 12.30 గంటలకు ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన, మహిళా, శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఖాళీల భర్తీపై నివేదికలు ఇవ్వనున్నారు. పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలు కూడా.. పదోన్నతుల కారణంగా ఏర్పడే ఖాళీలకు సంబంధించిన సమాచారం కూడా ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆర్థిక శాఖకు ఈ సమావేశంలో సమర్పించనున్నట్లు సమాచారం. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి జోనల్ వ్యవస్థ చిక్కుముడులు విడిపోవడం, డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఎలాంటి ఇబ్బందులు లేనందున తక్షణమే ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు ఆగమేఘాల మీద ఈ లెక్కలు సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి జనవరి నుంచే ఈ కసరత్తు జరిగినా.. కోవిడ్ కారణంగా భర్తీ ప్రక్రియ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కొత్త జోన్లకు ఇటీవలే రాష్ట్రపతి నుంచి ఆమోదం రావడంతో మళ్లీ ఈ ప్రక్రియ జోరందుకుంటోంది. -
1,917 పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటనలు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మంగళవారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలసి 2016–17కి సంబంధించిన సంస్థ వార్షిక నివేదికను అందజేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా 40,921 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతిచ్చిందని, 93 నియామక ప్రకటనలు, 28 శాఖాపర, ఆర్ఐఎంసీ, సీఏఎస్ ప్రకటనలు కలిపి మొత్తం 121 ప్రకటనలు జారీ చేశామన్నారు. ఇప్పటివరకు 128 గ్రూప్–1 పోస్టులు, 36,076 ఇతర పోస్టులు కలిపి మొత్తం 36,204 పోస్టుల భర్తీకి ప్రకటనలిచ్చామని తెలిపారు. 12,749 ఉద్యోగాల భర్తీ పూర్తయిందని తెలిపారు. 20,360 పోస్టులకు సంబంధించిన ఫలితాల ప్రకటనల జారీ/ నియామక పరీక్షల తర్వాతి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 3,095 పోస్టులకు సంబంధించిన నియామక పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నామని, 1,917 పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ చేయాల్సి ఉందన్నారు. 2,343 పోస్టుల నియామక ప్రకటనలను టీఎస్పీఎస్సీ ఉపసంహరించుకుందన్నారు. -
ఉద్యోగాల భర్తీలో టీఆర్ఎస్ విఫలం
పరిగి వికారాబాద్ : ఉద్యోగాల కల్పనలో టీఆర్ఎస్ ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మతిన్, జిల్లా అధ్యక్షుడు కోళ్ల యాద య్య, రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫ ల్యం నిరసిస్తూ బుధవారం పరిగి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనం తరం ఉప తహసీల్దార్ వాజేశ్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆహ్మద్ ఖాద్రి, జిల్లా అధికార ప్రతినిధి నరేందర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఆనంద్, నాయకులు వేణు, అనిల్, రాజు, రమేశ్, మహేశ్, వెంకటేశ్, ఖాజా, శ్రీనివాస్, హరికృష్ణ, అశోక్, బాల్‌రాజ్, న ర్సింహులు, చంద్రయ్య, నాగగారు, నగేశ్, తులసి, వీరేశం, సత్యయ్య, బాలు, హరిబాబు, మజీద్‌ఖాన్, ఎల్లయ్య, నవాజ్, గోపాల్ పాల్గొన్నారు. -
ఉద్యోగాలు భర్తీ చేయకుంటే ఉద్యమమే: కృష్ణయ్య
హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకపోతే ఉద్యమం తప్పదని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన నిరుద్యోగ గర్జనలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసం గించారు. నిరుద్యోగ జాక్ అధ్యక్షుడు నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య మాట్లా డుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. 14 లక్షల మంది ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రూప్–1లో 1,200, గ్రూప్–3లో 8 వేలు, గ్రూప్–4లో 36 వేల క్లరికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకపోతే ఉద్యమం చేపట్టేందుకు సిద్ధం కావాలన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే హైదరాబాద్ దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పలువురు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
ఉద్యోగాల భర్తీలో సర్కార్ ఫెయిల్
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగా లు ఖాళీగా ఉన్నా మూడేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేయలేక పోతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాల కల్పన, అవకాశాలు తగ్గిపోయాయన్నారు. తెలంగాణ సాధన ఉద్యమంలో భాగంగా యువత, విద్యార్థులు ఉద్యోగాల డిమాండ్‌పై ప్రధానంగా పోరాడిన విషయాన్ని మరిచిపోరాదన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీలో జాప్యం జరుగుతున్నందున, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిని కల్పిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా వర్సిటీలో నిర్వహించే ధర్మయుద్ధ సభకు కాంగ్రెస్ పూర్తి మద్దతునిస్తుందన్నారు. తెలంగాణలో ఐటీఐఆర్ ఏర్పాటుపై కేసీఆర్ ప్రభుత్వం మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ఉత్తమ్ తెలిపారు. కేంద్రం సహకారం తీసుకుని రైతులకు కనీస మద్దతు ధరతో పాటు బోనస్‌ను చెల్లిస్తామన్నారు.