పరిగి: తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
పరిగి వికారాబాద్ : ఉద్యోగాల కల్పనలో టీఆర్‌ఎస్ ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మతిన్, జిల్లా అధ్యక్షుడు కోళ్ల యాద య్య, రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫ ల్యం నిరసిస్తూ బుధవారం పరిగి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
అనం తరం ఉప తహసీల్దార్ వాజేశ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆహ్మద్ ఖాద్రి, జిల్లా అధికార ప్రతినిధి నరేందర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఆనంద్, నాయకులు వేణు, అనిల్, రాజు, రమేశ్, మహేశ్, వెంకటేశ్, ఖాజా, శ్రీనివాస్, హరికృష్ణ, అశోక్, బాల్‌రాజ్, న ర్సింహులు, చంద్రయ్య, నాగగారు, నగేశ్, తులసి, వీరేశం, సత్యయ్య, బాలు, హరిబాబు, మజీద్‌ఖాన్, ఎల్లయ్య, నవాజ్, గోపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment