తెలంగాణ ఉద్యమంలా.. బీసీ ఉద్యమం సాగాలి
గ్రామ స్థాయి నుంచి ఉప్పెనగా ఎగిసి పడాలి
రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
హన్మకొండ : ప్రత్యేక తెలంగాణ కోసం ఏ విధంగానైతే ఉద్యమం చేశామో.. అదే విధంగా బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల సాధనకు ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బుదవారం హన్మకొండలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కాలేజీలో జరిగిన బీసీల సమరభేరి మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీసీల్లో ఆలోచన విధానం మారితేనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాజ్యాధికారం రావాలంటే చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలన్నారు. ఈ దిశగా అన్ని పార్టీల్లో ఉన్న బీసీలు బయటకు వచ్చి సంఘటితంగా ఉద్యమించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషనులున్నాయి. బీసీ ప్రధాన మంత్రి ఉన్నారని.. ఇప్పుడు పోరాడితేనే చట్ట సభల్లో రిజర్వేషన్లు సాధించుకుంటామన్నారు. తెలంగాణలో 119 ఎమ్మెల్లే స్థానాల్లో కేవలం 19 మంది బీసీ ఎమ్మెల్యేలున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఒక్కరూ కూడాలేరన్నారు.
28 రాష్ట్రాలుంటే 15 రాష్ట్రాల నుంచి ఒక్క బీసీ ఎంపీ లేరన్నారు. అమెరికాలాంటి అగ్రదేశంలో బరాక్ ఓబామా అధ్యక్షుడయ్యారని, స్వాతంత్య్రం వచ్చిన 69 ఏళ్లలో ఒక్కరు కూడా సీఎం కాలేదన్నారు. బీసీ కులాల్లో ఆత్మవిశ్వాసం పెరగాలంటే బీసీలకు రాజ్యాధికారం రావాలన్నారు. బీసీ ఉద్యోగాలు పదోన్నతులు కల్పించాలని కోరారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి రూ.50 కోట్లు కేటాయించాలన్నారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ను జాతీయ స్థాయిలో అమ లు చేయాలని, బీసీ ఎస్సీ,ఎస్టీలకు ప్రైవేటు రంగం లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వకులాభరం కృష్ణమోహన్, రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శులు తాళ్ళ సంపత్‌కుమార్, బొమ్మగాని వినోద్‌కుమార్, ప్రజా సంఘాల నాయకులు బండ ప్రకాశ్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు దాడి మల్లయ్య, మొలుగూరు బిక్షపతి, సంజీవరావు, పెద్ది వెంకటనారాయణ, శారదదాదేవి, దాంపల్లి శ్రీనివాస్ నగపమురి పవన్ మామిడి శెడ్డి నాగరాజు, కిశోర్ సందీప్, రామకృష్ణ, చంద్రమౌళి, యాదగిరి, గిరిబోయిన రాజయ్య యాదవ్ పాల్గొన్నారు.
తీర్మానాలు
పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి , చట్ట సభలలో బీసీలకు 50శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి. పంచాయతీరాజ్ సంస్ధలో బీసీల రిజర్వేషన్లు 34 శాతం నుంచి 50 శాతంకు పెంచాలి.ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలి.కేంద్ర విద్యా , ఉద్యోగ రిజర్వేషన్లనపు బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతంకు పెంచాలి.
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.ఏటా రూ.50 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్టును తీసుకురావాలి. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ భద్రత కల్పించాలి. ప్రపంచీకరణ సరళీకృత ఆర్థిక విధానాలు రావడంతో ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి.
బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ తొలగించాలి. కేంద్రంలో బీసీలకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్ ఫీజుల రీయింబర్‌సమెంట్ యంబర్స్‌మెంటు స్కీమ్ విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి.
కేంద్ర ప్రభుత్వ శాఖలలో ప్రభుత్వ రంగ సంస్ధలలో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి.సుప్రీం కోర్టు హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలి. ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఐఐఎం కోర్సులు చదివే బీసీ విద్యార్థులు పూర్తిగా ప్రభుత్వమే ఫీజులు భరించాలి.కేంద్ర స్థాయిలో లక్ష కోట్ల బడ్జెట్‌తో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలి
జాతీయ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలకు విధించిన షరతులను ఎత్తివేయాలి. బీసీ కార్పొరేషన్ రుణాలకు విధించిన షరతులు ఎత్తివేయాలి. బీసీ కార్పొరేషన్ బడ్జెట్ ఏటారూ. 20 వేల కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేయాలి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడంలేదు.కులాల,వర్గాల ప్రమేయం లేకుండా రహస్య పద్దతిలో ఇంటర్వ్యూలు నిర్వహించాలి.
ఇవీ డిమాండ్లు
తెలంగాణ బడ్జెటులో బీసీల సంక్షేమానికి రూ. 20 వేల కోట్లు కేటాయించాలి. రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టాలి.{పతి బీసీ కులాల ఫెడరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయించాలి. బీసీ కార్పొరేషన్‌కు రూ.వేయి కోట్లు కేటాయించాలి. బీసీ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి. గత సంవత్సరం మంజూరు చేసిన బీసీ కార్పొరేషన్ రుణాలు వెంటనే విడుదల చేయాలి.
కళ్యాణలక్ష్మి పథకాన్ని బీసీలకు వర్తింప చేయాలి