సాక్షి, హైదరాబాద్: పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేందుకే ప్రైవేట్ వర్సిటీ బిల్లును ప్రభుత్వం పాస్ చేసిందని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు లేని ప్రైవేట్ వర్సిటీలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గురువారం బీసీ భవన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే 12 యూనివర్సిటీలు ఉండగా కొత్తగా ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు తేవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రైవేట్ వర్సిటీల్లో ఫీజులు లక్షల్లో ఉంటాయని, ఫీజు రీయింబర్స్ మెంట్ చేసే అవకాశం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment