
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 119 రెసిడెన్షియల్ పాఠశాలలు వెంటనే మంజూరు చేయాలని, ఆలస్యంగా ప్రారంభిస్తే విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగం ఉండదని’’ బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ విడుదల చేశారు.
పేద విద్యార్థులు అప్పులుచేసి ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 12శాతం జనాభా ఉన్న మైనారిటీలకు 204 రెసిడెన్షియల్ పాఠశాలలు, 15శాతం జనాభా ఉన్న ఎస్సీలకు 268 రెసిడెన్షియల్ పాఠశాలలు, 6శాతం జనాభా ఉన్న ఎస్టీలకు 169 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని, 52శాతం ఉన్న బీసీలకు 142 మాత్రమే ఉన్నా యన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు 890 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment