
'చంద్రబాబుకు గోరీ కడతాం'
హైదరాబాద్: కాపులను బీసీల్లో కలిపితే చూస్తూ ఊరుకోమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు. ఆయనిక్కడ బుధవారం మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులు బీసీల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు అన్యాయం చేస్తే చంద్రబాబుకు గోరీ కడతామన్నారు.