
బీసీలను టీడీపీకి తాకట్టుపెట్టిన కృష్ణయ్య
బీసీ సంక్షేమ సంఘాన్ని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి బీసీలకు తీరని అన్యాయం చేశారని ఆర్.క్రిష్ణయ్యపై ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ ధ్వజమెత్తారు.
అనంతపురం: బీసీ సంక్షేమ సంఘాన్ని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి బీసీలకు తీరని అన్యాయం చేశారని ఆర్.క్రిష్ణయ్యపై ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ ధ్వజమెత్తారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం అనంతపురంలోని ప్రెస్‌క్లబ్‌లో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఉదయ్‌కిరణ్ మాట్లాడుతూ క్రిష్ణయ్య నిర్ణయంతో అన్ని పార్టీలలోని బీసీ నాయకుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.
నూతన కార్యవర్గం
రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ (అనంతపురం), గౌరవాధ్యక్షులుగా వీరాంజనేయులు (కృష్ణా), ఉపాధ్యాక్షులుగా కామాచార్యులు (తూర్పుగోదావరి), సనూరి నాగేశ్వరి (గుంటూరు), రామంచంద్ర (అనంతపురం), కార్యదర్శులుగా ఉప్పల కొండయ్య (ప్రకాశం), కొరడా నాగభద్రం (తూర్పుగోదావరి), సూర్యనారాయణ (అనంతపురం), ప్రధాన కార్యదర్శులుగా రవికుమార్ (కర్నూలు), శ్రీనివాసులు (కడప), శ్రీనివాసులు (అనంతపురం), ట్రెజరర్లుగా బాలాంజనేయులు (అనంతపురం), జమీల్, ఎక్జిక్యూటివ్ మెంబర్లుగా గోవిందరాజులు, విష్ణువర ్ధన్, మీనుగ శ్రీనివాసులు, చంద్రశేఖర్, లక్ష్మి తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా అనంతపురానికి చెందిన లక్ష్మిదేవమ్మ ఎన్నికయ్యారు.