
బీసీ బిల్లుపై అఖిలపక్షం
పార్లమెంటు లో ప్రాతినిధ్యం వహిస్తున్న 36రాజకీయ పార్టీలతో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి బీసీ బిల్లుపై చర్చించాలని జాతీ
ఏర్పాటు చేయాలి: కృష్ణయ్య
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు లో ప్రాతినిధ్యం వహిస్తున్న 36రాజకీయ పార్టీలతో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి బీసీ బిల్లుపై చర్చించాలని జాతీ య బీసీసంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీసీల డిమాండ్లపై సోమవారం జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో కృష్ణయ్య మాట్లాడారు. పార్లమెంటు, అసెంబ్లీలో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం 15 శాతం దాటకపోవడం బీసీ వ్యతిరేకచర్యలకు నిదర్శనమన్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు అఖిలపక్షంతో ఢిల్లీకి రావాలని డిమాండ్ చేశారు. బీసీ ఎంపీలు బీసీల పక్షాన పోరాటాలు చేయాలని కోరారు. ధర్నాకు వివిధ రాష్ట్రాల నుంచి బీసీ కార్యకర్తలు తరలివచ్చారు.