
ఢిల్లీ: బీసీలకు అమలవుతున్న పథకాలకు ప్రత్యేక శాఖ అవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తామన్నారు. ఇటీవల కొత్తగా రెండు మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేశారని, ఈ క్రమంలోనే బీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.
‘75 సంవత్సరాలు గడిచినా బీసీలకు ప్రత్యేక శాఖ లేకపోవడం శోచనీయం. బీసీ లకు అమలవుతున్న పథకాల అమలుకు ప్రత్యేక శాఖ అవసరం.అనేక కమిషన్లు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని రికమెండ్ చేశాయి. దీనికోసం కేంద్రంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తుంది.దీనిపై ఎవరికీ అభ్యంతరం లేదు.చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే బీసీ బిల్లును ఆమోదింప చేయాలి.జడ్జీల నియామకంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. సామాజిక న్యాయానికి మా సీఎం వైఎస్ జగన్ ప్రతిబింబం. మంత్రి వర్గంలో సింహ భాగం బీసీలకు ఇచ్చారు. సామాజిక న్యాయం ఆచరణలో చూపిన సీఎం వైఎస్ జగన్’ అని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment