హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ఎంబీబీఎస్ సీట్లను అంగట్లో సరుకుల్లా అమ్ముకుంటున్నాయని, వారి ఆగడాలకు కళ్లెం వేయాలని బీసీ సంక్షేమ సంఘం కేంద్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఉపముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖమంత్రి టి.రాజయ్యను పలు బీసీ సంఘాల ప్రతినిధులతో కృష్ణయ్య కలిశారు.
ఈ సందర్భంగా మేనేజ్‌మెంట్ కోటాను తగ్గించాలని, ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు సొంత ప్రవేశ పరీక్ష పెట్టుకునే అధికారం ఇవ్వరాదని కోరారు. అలాగే ఎంబీబీఎస్, బీడీఎస్ ఫీజులను పెంచరాదని, మూడు కేటగిరీలను, రెండు కేటగిరీలకు కుదించాలని, యాజమాన్య కోటాను 60నుంచి 20శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్‌ను ప్రభుత్వమే జరుపుతుందని, మేనేజ్‌మెంట్ కోటాను తగ్గించడానికి త్వరలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు.
మెడికల్ సీట్లపై డిప్యూటీ సీఎంను కలిసిన కృష్ణయ్య
Published Tue, Jul 1 2014 10:28 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement