విద్యార్థుల తడాఖా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్,
నల్లగొండ రూరల్ : విద్యార్థుల తడాఖా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తు శుక్రవారం స్థానిక క్లాక్‌టవర్ సెంటర్‌లో బీసీ విద్యార్ధుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిం చిన ధర్నాకు హాజరై మాట్లాడారు. వారం, పది రోజుల్లో ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాల ర్‌షిప్‌ల బకాయిలు విడుదల చేయకపోతే జిల్లాలో మంత్రుల పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు పెండింగ్ స్కాలర్‌షిప్‌లను ఒకేసారి విడుదల చేయాలని, విడతల వారీగా మంజూరు కావడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
పేద విద్యార్ధులను విద్యకు దూరంలో చేయాలని ఉద్దేశ్యంతో బకాయిలను విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఫీజులు విడుదల అయ్యేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. ధనికరాష్ట్రమని అంటున్న సీఎం రూ. 1900 కోట్లను విడుదల చేసేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దొర పొకడను మానుకోవాలని హితవు పలికారు. ఇంటర్ విద్యార్ధులకు కూడా కాస్మోటిక్ బిల్లులు కూడ ఇవ్వాలని అన్నారు. సొంత హాస్టల్ భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. అందరం కలిసి పోరాటాల వలనే చీప్ లిక్కర్ అమలును ప్రభుత్వం వెనక్కి తీసుకుందని అన్నారు. లేకుంటే కలెక్టరేట్ లాంటి ముట్టడి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.
ఓయు విద్యార్థులు ఉద్యోగాలు అడిగితే సీఎం హేళనగా మాట్లాడరని, విద్యార్ధులంతా ఐక్యంగా వుంటే ప్రభుత్వం దిగివస్తుందని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతు దొరల ప్రభుత్వానికి వ్యతిరేకంగా గర్జింజే సింహంలా పోరాడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విమానాల్లో తిరిగేందుకు కోట్ల రూపాయలను ఖర్చుపెడుతున్న సీఎం పేద విద్యార్ధుల విద్యకు అవసరమయ్యే ఫీజురీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకపోవడం అణగారిన వర్గాల విద్యార్ధుల పట్ల సీఎంకు వున్న ప్రేమ స్పష్టమైందన్నారు. విద్యార్ధులు ఎవ్వరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఏదైనా ఇబ్బంది వుంటే పోలీసుల టోల్‌ఫ్రీం నెంబర్‌కు ఫోన్‌చేయాలని విజ్ఞప్తి చేశారు.
తల్లిదండ్రులు ఆశయాలు, నెరవెర్చేందుకు బ్రతికి వుండి పోరాడాలని కోరారు. ఇంటర్ విద్యార్ధి భవాని మృతిపట్ల సంతాపం ప్రకటించారు. అంతకు ముందు బీసీ కళామండలి కన్వీనర్ రామలింగం ఆధ్వర్యంలో ఆటపాట అందర్నీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గండిచెరువు వెంకన్న, నీలం వెంకటేశ్వర్లు, వైద్యుల సత్యనారాయణ, దుడుకు లక్ష్మినారాయణ, చంద్రశేఖర్‌గౌడ్ ,బాబ్జీ, రూక్నగౌడ్, రమేష్, మల్లిఖార్జున్, సంజీవ, శ్రవణ్, సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.