సీపీఎస్ రద్దును కోరుతూ 20న ర్యాలీ: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకే తరహాలో సాధారణ పెన్షన్ పథకాన్ని అమలు చేయాలన్నారు. ఈమేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.
సీపీఎస్ రద్దును కోరుతూ ఈ నెల 20న మహార్యాలీ నిర్వహిస్తున్నామని, అనంతరం చలో శంషాబాద్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. దీనికి ఉపాధ్యాయ సంఘాలన్నీ మద్దతిచ్చి పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం రూపొందించిన వాల్పోస్టర్, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.