బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
కడ్తాల: బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మె ల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తిం పజేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ యాక్ట్‌లాగే బీసీలకు యాక్ట్ ను అమలుచేయాలన్నారు. నిరుపేద బీసీలకు మూడెకరాల భూమిని కేటాయిం చాలన్నారు.
మంగళవారం ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామంలోని ఏంబీఏ గార్డెన్‌లో నిర్వహించిన బీసీల సింహగర్జన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. దేశంలో బీసీలుగా పుట్టడమే పాపమైం దని, వారిని ఏ రాజకీయపార్టీలు, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో 115 మంది బీసీ సభ్యులున్నా మాట్లాడలేని పరిస్థితి నెలకొం దన్నారు. రాజ్యాధికా రం లేని కులాలు బానిసలతో సమానమని, స్వయంపాలన కోసం బీసీలు ఉద్యమించాలని, అవసరమైతే బోడోలు, గుజ్జర్ల తరహా లో ఆందోళనలు కొనసాగించాలని పిలుపుని చ్చారు.
పార్లమెంట్, అసెంబ్లీ లు పారి శ్రామికవేత్త లు, కాంట్రాక్టర్లు, రియల్టర్లతో నిండిపోయాయని, దీం తో ఎంపీ, ఎమ్మెల్యే లు ప్రజాసమస్యలను పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మం త్రిత్వశాఖను ఏర్పాటుచేసి బడ్జెట్‌లో రూ.50వేల కోట్లతో సబ్‌ప్లాన్‌ను ఏ ర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు. ఫీజు రీయింబ ర్స్‌మెంట్ పథకాన్ని అమలుచేయాలన్నారు. ఈ సందర్భం గా మంగల్‌పల్లి గ్రామంలో లైంగికదాడికి గురైన బాలికను, వారి తల్లిదండ్రులను పరామర్శించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.
బీసీలంతా సంఘటితంగా
ఉద్యమించాలి అంతకుముందు మాజీమంత్రి జే.చిత్తరంజన్‌దాస్, మాజీ ఎమ్మెల్యే జి.జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. బీసీలంతా హక్కులసాధన కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం నియోజకవర్గంలో ఎన్నికైన బీసీ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీసీ సంక్షే మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దుర్గయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు అశోక్, బీసీ ప్రంట్ అధ్యక్షుడు మల్లేశ్‌యాదవ్, గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ఆమనగల్లు ఎంపీపీ లలితమ్మ, బీసీ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శారద, నా యకులు రామకృష్ణ, ఆంజనేయులు, నర్సింహా, చందోజీ పాల్గొన్నారు.