విశాఖపట్నంలో ఐఐఎం, ఐఐటీ
హైదరాబాద్: జాతీయస్థాయి విద్యాసంస్థలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఐఐఎం, ఐఐటీ, ట్రైబల్ యూనివర్సిటీ పెట్రోలియం యూనివర్సిటీలను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విజయవాడ - గుంటూరు మధ్య ఎయిమ్స్, నిట్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఎన్డీఎంఏ ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
తిరుపతిలో సెంట్రల్ యూనివర్శిటీ, ఐఐటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. జాతీయ విద్యా సంస్థల కోసం ఒక్కో జిల్లాలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించినట్టు మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి. నారాయణ, కామినేని శ్రీనివాసరావు తెలిపారు.