* ఐఐటీ, ఐఐఎం అభ్యర్థులకు తప్పనున్న తిప్పలు
న్యూఢిల్లీ: ఐఐటీ, ఐఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తమ సర్టిఫికెట్ల కాపీల ధ్రువీకరణకోసం గెజిటెట్ అధికారుల చుట్టూ తిరగాల్సిన తిప్పలు తప్పనున్నాయి. సర్టిఫికెట్ల కాపీలకు ఆ అధికారుల ధ్రువీకరణ అవసరం లేదని, వాటిని వారే సొంతంగా ధ్రువీకరించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అభ్యర్థులు సొంతంగా అటెస్ట్ చేసుకు న్న సర్టిఫికెట్లను స్వీకరించాలని ఆయా విద్యాసంస్థల్ని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశించింది.
ఆ సర్టిఫికెట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కోరిం ది. ఈ విధానం ప్రస్తుత విద్యా సంవత్సరంనుంచే అమల్లోకి వచ్చినట్లు ఆ శాఖ అధికారులు చెప్పారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను అడ్మిషన్ల సమయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర స్థాయి సంస్థలు కూడా ఈ విధానాన్ని అనుసరించాలని కోరనున్నామన్నారు.
సర్టిఫికెట్ల ధ్రువీకరణలో ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందుల నివారణకు స్వీయ ధ్రువీకరణ విధానాన్ని తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ వివిధ మంత్రిత్వ శాఖలను కోరిన నేపథ్యంలో మానవ వనరుల అభివృద్ధిశాఖ పై నిర్ణయం తీసుకుంది. మార్కుల జాబితాలు వంటి కొన్ని సర్టిఫికెట్లను సొంతంగా అటెస్ట్ చేసుకునే విధానాన్ని పలు కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే అమల్లోకి తెచ్చాయి.
సర్టిఫికెట్లను సొంతంగా అటెస్ట్ చేసుకోవచ్చు
Published Mon, Oct 28 2013 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
Advertisement