ఐఐఎం-ఇండోర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్.. | IIM-Indore Integrated Program | Sakshi
Sakshi News home page

ఐఐఎం-ఇండోర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్..

Published Thu, Oct 2 2014 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

ఐఐఎం-ఇండోర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్..

ఐఐఎం-ఇండోర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్..

ఎంఎస్సీ స్టాటిస్టిక్స్‌ను ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలపండి? ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ)-బెంగళూరు ప్రవేశ ప్రక్రియ ఎలా ఉంటుంది?    -జనార్ధన్, మెదక్.ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ కోర్సు చేసిన వారికి జాబ్ మార్కె ట్లో మంచి డిమాండ్ ఉంది. దేశంలో చాలా యూనివర్సిటీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. వాటిల్లో కొన్ని..
 
     ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
     పవేశం: ఎంట్రె న్స్ ఆధారంగా
     వివరాలకు: www.osmania.ac.in
     ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం
     అర్హత: బీఎస్సీ(మ్యాథ్స్/స్టాటిస్టిక్స్).
     పవేశం: ఎంట్రెన్స్ ఆధారంగా
     వేంకటేశ్వర యూనివర్సిటీ- తిరుపతి
     అర్హత: బీఏ/ బీఎస్సీ(మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్).
     పవేశం: ఎంట్రెన్స్ ఆధారంగా
     వివరాలకు: www.svuniversity.in
     ఆచార్య నాగార్జున యూనివర్సిటీ- గుంటూరు
     అర్హత: బీఎస్సీ మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్
     వివరాలకు: www.nagarjunauniversity.ac.in
 
 ఐఎస్‌ఐ(ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్)-బెంగళూరు: బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, మాస్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఎంఎస్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎంఎస్ ఇన్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ సైన్స్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్/రీసెర్చ్ అసిస్టెంట్‌షిప్, పార్ట్-టైమ్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ (ఎస్‌క్యూసీ) కోర్సులను అందిస్తుంది. ఈ కోర్సుల్లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
     వివరాలకు: www.isibang.ac.in
 
 ఐఐఎం-ఇండోర్ ఆఫర్ చేస్తున్న ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ వివరాలను తెలపండి?
 -ప్రవీణ్, కరీంనగర్.
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)-ఇండోర్ ఆఫర్ చేస్తున్న వినూత్న కోర్సు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం). 60 శాతం మార్కులతో 10వ తరగతి/తత్సమానంతోపాటు +2/12వ తరగతి/తత్సమాన కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు (ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం). లేదా సాట్-1 స్కోర్ 1600-2400 మధ్యలో (ఎస్సీ/ఎస్టీలకు 1475-2400 మధ్య) ఉండాలి. ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ, అకడెమిక్ రికార్డ్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఇందులో క్వాంటిటేటివ్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీ విభాగాల నుంచి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. వీటికి రెండు గంటల్లో సమాధానాలను గుర్తించాలి. ఐదేళ్ల ఈ కోర్సులో మొదటి మూడేళ్లకు ట్యూషన్ ఫీజు సంవత్సరానికి రూ. 3 లక్షలు. తర్వాతి రెండేళ్లకు రూ. 5 లక్షలు. సోషల్ సెన్సైస్, మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ అంశాల సమ్మిళితంగా కోర్సు కూర్పు ఉండడం విశేషం. కోర్సులో.. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, లాజికల్ కంప్యూటర్ సైన్స్, పొలిటికల్ సైన్స్, సివిలైజేషన్ అండ్ హిస్టరీ, బయోలాజికల్ సెన్సైస్, లాంగ్వేజెస్ (ఒక భారతీయ భాష, ఒక విదేశీ భాష), సాఫ్ట్ స్కిల్స్ అంశాలు.. 40 శాతం మేర ఉంటాయి. తర్వాతి 50 శాతంలో మేనేజ్‌మెంట్ అంశాలైన.. అకౌంటింగ్, ఫైనాన్స్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఆపరేషన్స్ అండ్ సర్వీస్ మేనేజ్‌మెంట్,మార్కెటింగ్, ఎకనామిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కార్పొరేట్ గవర్నెన్స్, డెసిషన్ సైన్స్, లీగల్ ఆస్పెక్ట్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇంటర్నేషనల్ బిజినెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తరహా అంశాలను బోధిస్తారు. మిగిలిన 10 శాతంలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది.
 వివరాలకు: www.iimidr.ac.in
 
 ఎంటెక్‌లో నానో టెక్నాలజీ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?
 -కిరణ్, విజయవాడ.
 పరిశోధనల పరంగా విస్తృత పరిధి కలిగి ఉన్న రంగాల్లో నానోటెక్నాలజీ ఒకటి. అణువు, పరమాణువుల సమ్మేళనమే నానోటెక్నాలజీ. ఈ శాస్త్ర అనువర్తనాలను మెడిసిన్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్, తదితర పరిశ్రమల్లో వినియోగిస్తారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంజనీరింగ్ అంశాలు ఉంటాయి. నానోటెక్నాలజీకి సంబంధించి దశాబ్ద కాలంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా భారత ప్రభుత్వం పరిశోధనలకు పెద్ద పీట వేస్తుండడంతోపాటు ఈ రంగానికి భారీగా నిధులను కేటాయిస్తోంది. దీంతో ఈ కోర్సు ఉపాధి అవకాశాలకు వేదికగా మారుతోంది.
 
 ఆఫర్ చేస్తున్న వర్సిటీలు:
     జేఎన్‌టీయూ-హైదరాబాద్
     కోర్సు: ఎంటెక్ (నానో టెక్నాలజీ)
     వివరాలకు: www.jntuh.ac.in
      సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (డీమ్డ్ యూనివర్సిటీ) -పుట్టపర్తి
     కోర్సు: ఎంఎస్సీ (నానో సైన్స్)
     వివరాలకు: www.sssihl.edu.in
     వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -తమిళనాడు
     కోర్సు: ఎంటెక్ (నానో టెక్నాలజీ)
     వివరాలకు: www.vit.ac.in
     అమిటీ యూనివర్సిటీ-నోయిడా
     కోర్సులు: ఎంఎస్సీ, ఎంటెక్ (నానో టెక్నాలజీ)
     వివరాలకు: www.amity.edu
 
 ఐబీపీఎస్ పీవో ఆన్‌లైన్ మోడల్ టెస్ట్స్
 హైదరాబాద్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో(ఎస్‌బీఐ తప్ప) ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీకి 2014 అక్టోబర్ 11, 12, 18, 19, నవంబర్ 1, 2 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులు సులువుగా ప్రాక్టీస్ చేసుకునేందకు వీలుగా సాక్షి దేశవ్యాప్తంగా అక్టోబర్ 7, 15, 28 తేదీల్లో లైవ్ మోడల్ టెస్ట్స్ నిర్వహిస్తోంది.
 
 మోడల్ టెస్ట్స్ విశేషాలు:
 24 గంటల పాటు ఎప్పుడైనా పరీక్ష రాసుకునే సౌలభ్యం
 నెట్‌వర్క్, పవర్ ఫెయిల్యూర్ అయితే పరీక్ష నిలిచిపోయిన దగ్గర నుంచే తిరిగి రాసే వెసులుబాటు
 పరీక్ష ముగిసిన వెంటనే గ్రేడులతో కూడిన ఫలితాలు
 అభ్యర్థి ప్రదర్శనను తెలిపే గ్రాఫికల్ ఫర్‌ఫార్మెన్స్ రిపోర్టుతో పాటు సబ్జెక్టుల వారీ వీక్ అండ్ స్ట్రాంగ్ ఏరియా నాలసిస్
 ఈమెయిల్‌కు ఫలితాలు, ర్యాంకులు
 వెబ్‌సైట్:
 http://onlinetests.sakshieducation.com/
 http://www.sakshieducation.com/Banks/
 Index.html
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement