షైనింగ్ కెరీర్‌కు.. ఫుట్‌వేర్ | Shining career to.. Footwear | Sakshi
Sakshi News home page

షైనింగ్ కెరీర్‌కు.. ఫుట్‌వేర్

Published Mon, May 2 2016 3:50 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM

షైనింగ్ కెరీర్‌కు.. ఫుట్‌వేర్

షైనింగ్ కెరీర్‌కు.. ఫుట్‌వేర్

గ్రాడ్యుయేట్స్ స్పెషల్
ఇంజనీరింగ్‌కు ఐఐటీలు ఫేమస్.. మేనేజ్‌మెంట్ అంటే ఐఐఎంలే గుర్తొస్తాయి.. సాధారణ వృత్తి నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగిన ఫుట్‌వేర్ రంగంలో  రాణించాలంటే.. ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్  ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ)లో చేరాల్సిందే. ప్రస్తుతం ఇందులో వివిధ కోర్సులకు ప్రకటన విడుదలైంది. వివరాలు..
 
ఎఫ్‌డీడీఐ..
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎఫ్‌డీడీఐని 1986లో ఏర్పాటు చేశారు. ఫుట్‌వేర్, లెదర్ ఇండస్ట్రీలో పరిశోధనలు, అభివృద్ధితో పాటు ఈ రంగంలో మానవ వనరుల కొరతను తీర్చాలనే లక్ష్యంతో ఎఫ్‌డీడీఐని నెలకొల్పారు. ఎఫ్‌డీడీఐ ప్రధాన క్యాంపస్ నోయిడాలో ఉంది. హైదరాబాద్‌తోపాటు మరో పది నగరాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. ఎన్నో అంతర్జాతీయ, జాతీయ స్థాయి అవార్డులు, గుర్తింపులు పొందిన ఈ సంస్థ నుంచి ఏటా 1800 మంది సుశిక్షుతులు ఎంఎన్‌సీ స్థాయి కంపెనీలకు ఎంపిక అవుతున్నారు.
 
 
బీఎస్సీ కోర్సులు..
ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌ల్లో బ్యాచిలర్ స్థాయిలో ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ కోర్సు; బీఎస్సీ రిటైల్ - ఫ్యాషన్ మర్చండైస్; బీఎస్సీ ఫ్యాషన్ లెదర్ యాక్సెసరీ డిజైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని విజయవంతంగా పూర్తిచేస్తే ఉపాధి పరంగా మంచి అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఆసక్తి ఉంటే ఉన్నత విద్య దిశగా కూడా వెళ్లొచ్చు.
 
అర్హత
బ్యాచిలర్‌‌స డిగ్రీ కోర్సులకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు, పీజీ కోర్సులకు బ్యాచిలర్‌‌స డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
చేరండిలా..
ప్రవేశానికి అర్హత గల అభ్యర్థులు ఆల్ ఇండియా సెలెక్షన్ టెస్ట్ (ఏఐఎస్‌టీ) రాయాలి. ఆన్‌లైన్ పరీక్షలో బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయి. దేశవ్యాప్తంగా సుమారు 36 కేంద్రాల్లో టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష పత్రం ఇంగ్లిష్, హిందీ మీడియంలలో ఉంటుంది. ఏఐఎస్‌టీలో మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
 
సిలబస్..
ప్రవేశ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. యూజీ కోర్సుల్లో మ్యాథమెటి క్స్ 45, జనరల్ సైన్స్ 30, ఇంగ్లిష్ 45, జనరల్ అవేర్‌నెస్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. పీజీ కోర్సులకు రీజనింగ్ అండ్ క్యూఏ 45, ఇంగ్లిష్ 45, జనరల్ అవేర్‌నెస్ 30, బిజినెస్ ఆప్టిట్యూడ్‌లపై 30 ప్రశ్నలుంటాయి.
 
ఆన్‌లైన్‌లో దరఖాస్తు..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అడిగిన ధ్రువపత్రాలను సబ్‌మిట్ చేయాలి. ఒకే దర ఖాస్తులో ఒకటి కంటే ఎక్కువ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేయొచ్చు. కోర్సు కోడ్‌లను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: www.www.fddiindia.com
 
పరీక్ష నుంచి మినహాయింపు
పీజీ కోర్సుల్లో చేరాలనుకునేవారు క్యాట్, గ్జాట్, మ్యాట్, ఏఐఎంఏ, ఎన్‌మ్యాట్, ఏఎంసీఏటీ, స్నాప్, జీమ్యాట్, ఏఐఎం-క్యాట్‌ల్లో ప్రతిభ ఆధారంగా ఏఐఎస్‌టీతో సంబంధం లేకుండా చేరొచ్చు. బ్యాచిలర్ డిగ్రీ కోసం బిట్‌శాట్, ఐఐటీ జేఈఈ, జీజీఎస్‌ఐపీయూ, విట్, ఎస్‌ఆర్‌ఎం, బీసీఈసీఈ, యూపీఎస్‌ఈఈ, ఎంపీసీఈటీ, జీయూజేసీటీ, ఎంసెట్, సీఓఎంఈడీకే తదితర పరీక్షల్లో మెరుగైన ర్యాంకులు సాధించినవారు కూడా ప్రవేశపరీక్షతో సంబంధం లేకుండా నేరుగా యూజీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
 
ముఖ్య తేదీలు
దరఖాస్తుకు చివరి తేదీ: మే 20
ప్రవేశ పరీక్ష: జూన్ 10, 11, 12
ఫలితాల వెల్లడి: జూన్ 24  
యూజీ కోర్సుల కౌన్సెలింగ్ తేదీలు: జూలై 13, 14, 15
పీజీ కోర్సులు: జూలై 11, 12

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement