breaking news
Footwear Design and Development Institute
-
ఎఫ్‌డీడీఐ-హైదరాబాద్‌లో కొత్త కోర్సులు
రాయదుర్గం: ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్–హైదరాబాద్ క్యాంపస్‌లో కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టారు. ఫుట్‌వేర్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్, రిటైల్ అండ్ డిజిటల్ ఫ్యాషన్ వ్యాపారం, లెదర్ యాక్సెసరీస్, బ్యాగ్‌ల అభివృద్ధి రంగాల్లో పరిశ్రమలు, సిద్ధంగా ఉన్న విద్యార్థుల నైపుణ్యాలను బలోపేతం చేయడానికి, ఉపాధిని పెంచడానికి దోహదం చేసేలా డిప్లొమో కోర్సుల ముఖ్య లక్షణంగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కోర్సులను ఆరు నెలల వ్యవధి గల రెండు మాడ్యూల్లుగా విభజించారు. అభ్యాసకులు ఒక మాడ్యూల్‌ను అనుసరించి సర్టిఫికెట్ పొందవచ్చు. రెండు మాడ్యూల్లను పూర్తి చేసి పూర్తి సంవత్సరం డిప్లొమో పొందడానికి అవకాశం కల్పిస్తారు. అందుబాటులోకి వచ్చే కోర్సులు ఇవే.. మొదటి విడతలో నూతనంగా డిప్లొమో ఇన్ ఫ్యాషన్ డిజైన్, డిప్లొమో ఇన్ ఫుట్‌వేర్ టెక్నాలజీ, డిప్లొమో ఇన్ లెదర్ యాక్సెసరీస్ అండ్ బ్యాగ్ డెవలప్మెంట్, డిప్లొమో ఇన్ రిటైల్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో డిప్లొమో ఇన్ ఫ్యాషన్ డిజైన్, డిప్లొమో ఇన్ ఫుట్‌వేర్ టెక్నాలజీ, డిప్లొమో ఇన్ లెదర్ యాక్సెసరీస్ అండ్ బ్యాగ్ డెవలప్మెంట్ కోర్సులకు ఒక్కోదానికి ఒక్క మాడ్యూల్‌కు రూ.45 వేలు, డిప్లొమో ఇన్ రిటైల్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ ఒక్క మాడ్యూల్‌కు రూ.40 వేలను చెల్లించాల్సి ఉంటుంది.ఈ కోర్సుల కోసం దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభిస్తారు. కోర్సులను అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తులు వెబ్సైట్ www.fddiindia.comలో అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 94404 71336, 99667 55563, 99667 55536లలో సంçప్రదించాలని అధికారులు సూచించారు. ఇతర వివరాలకు రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐ–హైదరాబాద్ క్యాంపస్‌లో సంప్రదించాలని సూచించారు. -
షైనింగ్ కెరీర్‌కు.. ఫుట్‌వేర్
గ్రాడ్యుయేట్స్ స్పెషల్ ఇంజనీరింగ్‌కు ఐఐటీలు ఫేమస్.. మేనేజ్మెంట్ అంటే ఐఐఎంలే గుర్తొస్తాయి.. సాధారణ వృత్తి నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగిన ఫుట్‌వేర్ రంగంలో రాణించాలంటే.. ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ)లో చేరాల్సిందే. ప్రస్తుతం ఇందులో వివిధ కోర్సులకు ప్రకటన విడుదలైంది. వివరాలు.. ఎఫ్‌డీడీఐ.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎఫ్‌డీడీఐని 1986లో ఏర్పాటు చేశారు. ఫుట్‌వేర్, లెదర్ ఇండస్ట్రీలో పరిశోధనలు, అభివృద్ధితో పాటు ఈ రంగంలో మానవ వనరుల కొరతను తీర్చాలనే లక్ష్యంతో ఎఫ్‌డీడీఐని నెలకొల్పారు. ఎఫ్‌డీడీఐ ప్రధాన క్యాంపస్ నోయిడాలో ఉంది. హైదరాబాద్‌తోపాటు మరో పది నగరాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. ఎన్నో అంతర్జాతీయ, జాతీయ స్థాయి అవార్డులు, గుర్తింపులు పొందిన ఈ సంస్థ నుంచి ఏటా 1800 మంది సుశిక్షుతులు ఎంఎన్సీ స్థాయి కంపెనీలకు ఎంపిక అవుతున్నారు. బీఎస్సీ కోర్సులు.. ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌ల్లో బ్యాచిలర్ స్థాయిలో ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ కోర్సు; బీఎస్సీ రిటైల్ - ఫ్యాషన్ మర్చండైస్; బీఎస్సీ ఫ్యాషన్ లెదర్ యాక్సెసరీ డిజైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని విజయవంతంగా పూర్తిచేస్తే ఉపాధి పరంగా మంచి అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఆసక్తి ఉంటే ఉన్నత విద్య దిశగా కూడా వెళ్లొచ్చు. అర్హత బ్యాచిలర్‌స డిగ్రీ కోర్సులకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు, పీజీ కోర్సులకు బ్యాచిలర్‌స డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. చేరండిలా.. ప్రవేశానికి అర్హత గల అభ్యర్థులు ఆల్ ఇండియా సెలెక్షన్ టెస్ట్ (ఏఐఎస్‌టీ) రాయాలి. ఆన్లైన్ పరీక్షలో బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయి. దేశవ్యాప్తంగా సుమారు 36 కేంద్రాల్లో టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష పత్రం ఇంగ్లిష్, హిందీ మీడియంలలో ఉంటుంది. ఏఐఎస్టీలో మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సిలబస్.. ప్రవేశ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. యూజీ కోర్సుల్లో మ్యాథమెటి క్స్ 45, జనరల్ సైన్స్ 30, ఇంగ్లిష్ 45, జనరల్ అవేర్నెస్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. పీజీ కోర్సులకు రీజనింగ్ అండ్ క్యూఏ 45, ఇంగ్లిష్ 45, జనరల్ అవేర్నెస్ 30, బిజినెస్ ఆప్టిట్యూడ్‌లపై 30 ప్రశ్నలుంటాయి. ఆన్లైన్లో దరఖాస్తు.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అడిగిన ధ్రువపత్రాలను సబ్మిట్ చేయాలి. ఒకే దర ఖాస్తులో ఒకటి కంటే ఎక్కువ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేయొచ్చు. కోర్సు కోడ్లను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: www.www.fddiindia.com పరీక్ష నుంచి మినహాయింపు పీజీ కోర్సుల్లో చేరాలనుకునేవారు క్యాట్, గ్జాట్, మ్యాట్, ఏఐఎంఏ, ఎన్‌మ్యాట్, ఏఎంసీఏటీ, స్నాప్, జీమ్యాట్, ఏఐఎం-క్యాట్ల్లో ప్రతిభ ఆధారంగా ఏఐఎస్టీతో సంబంధం లేకుండా చేరొచ్చు. బ్యాచిలర్ డిగ్రీ కోసం బిట్‌శాట్, ఐఐటీ జేఈఈ, జీజీఎస్‌ఐపీయూ, విట్, ఎస్ఆర్ఎం, బీసీఈసీఈ, యూపీఎస్ఈఈ, ఎంపీసీఈటీ, జీయూజేసీటీ, ఎంసెట్, సీఓఎంఈడీకే తదితర పరీక్షల్లో మెరుగైన ర్యాంకులు సాధించినవారు కూడా ప్రవేశపరీక్షతో సంబంధం లేకుండా నేరుగా యూజీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ముఖ్య తేదీలు దరఖాస్తుకు చివరి తేదీ: మే 20 ప్రవేశ పరీక్ష: జూన్ 10, 11, 12 ఫలితాల వెల్లడి: జూన్ 24 యూజీ కోర్సుల కౌన్సెలింగ్ తేదీలు: జూలై 13, 14, 15 పీజీ కోర్సులు: జూలై 11, 12