ఎట్టకేలకు ఓకే | Finally okay | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ఓకే

Published Sat, Jan 17 2015 7:06 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

Finally okay

  •  ఐఐఎంకు శంకుస్థాపన నేడు
  •  కొలిక్కి వచ్చిన చర్చలు, సమసిన భూవివాదం
  •  కేంద్రమంత్రులు స్మృతి ఇరాని, వెంకయ్య, సీఎం చంద్రబాబు హాజరు
  •  విద్యా సంస్థల వ్యతిరేకతతో రద్దయిన ‘విద్యా సదస్సు’
  • సాక్షి, విశాఖపట్నం: ఎట్టకేలకు ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెం ట్(ఐఐఎం)కు శంకుస్థాపన జరగనుంది. తొలుత ఈ నెల 5వ తేదీనే ఈ కార్యక్రమం తలపెట్టినప్పటికీ బాధిత రై తుల ఆందోళనల నేపథ్యంలో వాయిదా పడింది. గత నెల  రోజులుగా రోజు కోరీతిలో సాగిన బాధిత రైతుల ఆందోళన ఉత్కంఠ, ఉద్రిక్తత వాతావరణాన్ని కల్పించా యి. దీంతో శనివారం తలపెట్టిన శంకుస్థాపన జరుగుతుందో లేదోననే అనుమానాలు నెలకొన్నాయి. మరో పక్క శనివారం తలపెట్టిన విద్యాసదస్సు మాత్రం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకతతో రద్దు చేయకతప్పలేదు.

    జాతీయ విద్యాసంస్థ కోసం గుర్తించిన భూములకు పరిహారం చెల్లించే ఆక్రమిత రైతులను పరిగణనలోకి తీసుకోకపోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సమస్య పరిష్కారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఉదాశీనంగా వ్యవహరించడంతో పరిస్థితి మరింత జఠిలమైం ది. పట్టాదారులకు మాత్రమే ఎకరాకు రూ.20లక్షల పరిహారం ఇస్తామని, మిగిలిన ఆక్రమిత రైతులకు చిల్లిగవ్వ ఇచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేయడంతో రెవెన్యూ అధికారులు తీవ్ర ప్రతిఘటనకు ఎదుర్కొక తప్పలేదు.

    పట్టాదారులు జత కట్టడంతో ఆక్రమిత రైతుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. చివరకు సాక్షి వరుస కథనాలతో మౌనం వీడిన మంత్రి గంటా శ్రీనివాసరావు రైతులతో చర్చలు జరపడం మొదలు పెట్టారు. ఆక్రమిత రైతులకు తొలుత ఎకరాకు రూ.2.5 లక్షలిస్తామని నచ్చజెప్పిన మంత్రి చివరకు మరో అడుగు కిందకు దిగి ఎకరాకు రూ.6 లక్షలు ఇప్పిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో బాధిత రైతులు శాంతించారు. దీంతో శంకుస్థాపన సమయంలో ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా జరిగే అవకాశాలు ఏర్పడడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో గంభీరంలో ఐఐఎం శంకుస్థాపనకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
     
    ఐఐఎం శంకుస్థాపనతో పాటు నిర్వహించతలపెట్టిన విద్యాసదస్సు రద్దు చేయకతప్పలేదు. తొలుత ఈ నెల 5వ తేదీన ఐఐఎం శంకుస్థాపనతో పాటు ఈ సదస్సు నిర్వహించాలని భావించినప్పటికీ అప్పట్లో సదస్సుకు ఇబ్బందిలేకున్నా ఐఐఎం భూవివాదం నేపథ్యంలో సదస్సు నిర్వహణకు బ్రేకుపడింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement