ఐఐఎంల్లో ఇకపై డిప్లొమాలకు బదులుగా డిగ్రీలు | Degrees instead of diplomas at IIMs | Sakshi
Sakshi News home page

ఐఐఎంల్లో ఇకపై డిప్లొమాలకు బదులుగా డిగ్రీలు

Published Tue, Jan 2 2018 2:39 AM | Last Updated on Tue, Jan 2 2018 2:39 AM

Degrees instead of diplomas at IIMs - Sakshi

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఐఐఎం బిల్లు–2017కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం ఆమోదం తెలిపారు. ఈ చట్టం కింద ఐఐఎంలు ఇకపై విద్యార్థులకు డిప్లొమాలకు బదులుగా డిగ్రీలు ప్రదానం చేయవచ్చని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడించారు.

ఈ బిల్లును గతేడాది జూలైలో లోక్‌సభ, డిసెంబర్‌లో రాజ్యసభ ఆమోదించాయని వెల్లడించారు. తాజా చట్టం కింద ఐఐఎంల నిర్వహణ, బోధనా సిబ్బందితో పాటు డైరెక్టర్ల నియామకంలో సదరు సంస్థలకు మరింత స్వయం ప్రతిపత్తిని కల్పించినట్లు స్పష్టం చేశారు. ఈ చట్టం ప్రకారం ప్రతి ఐఐఎంకు 19 మంది సభ్యులతో కూడిన బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ (బీవోజీ) ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement