మాములుగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే ఎలా ఉంటుందనేది అందరికీ తెలుసు. ఎప్పుడో చిన్నప్పడూ కలిసి చదువుకున్న స్నేహితులంతా చాలా ఏళ్ల తర్వాత ఆత్మీయంగా కలుసుకుని భావోద్వేగం చెందుతారు. ఇది సహజం. పైగా చిన్ననాటి స్నేహితులు కావడంతో ఎవ్వరీ ముఖాలు ఎవ్వరూ గుర్తు పట్టాలేనంతగా మార్పు చెందుతాయి. పైగా ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి పెద్ద పొజిషన్‌లో ఉండేవారు కొందరైతే, చిన్నా చితక ఉద్యోగాలు చేసుకునే వాళ్లు మరికొందరూ. అదీగాక మన బ్యాచ్‌లో ఇంత గొప్పగా సెటిల్ అయినవాళ్లు కూడా ఉన్నారా? అని గొప్పగా ఫీలైపోతుంటాం కూడా. అలాంటి ఆత్మీయ సమ్మేళనం లక్నోలో ఎందుకోసం జరిగిందో వింటే షాకవ్వుతారు.
వివరాల్లోకెళ్తే..ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, లక్నో (ఐఐఎం-ఎల్)లో 2011 బ్యాచ్‌కి చెందిన విద్యార్థుల పూర్వ సమ్మేళన సందేశం చాలా వింతంగా ఉంది. వారంతా కలుసుకుందామంటూ వాట్సాప్‌కి పంపించిన ఓ సందేశాన్ని లక్నోకి చెందిన పూర్వ విద్యార్థి రవి హండా నెట్టింట షేర్ చేశారు. నిజానికి ఐఐఎం లాంటి సంస్థల్లో కచ్చితంగా నూటికి నూరుశాతం ప్లేస్‌మెంట్ సంపాదించుకోగలరు విద్యార్థులు. కనీసం బయట ఎక్కడైనా కూడా ఈజీగా ఉద్యోగం వచ్చేస్తుంది వానికి. ఎందుకంటే అవి ప్రతిష్టాత్మకమైన ఇన్‌స్టిట్యూట్లు, పైగా అందులో చదివారంటే చాలు వెంటనే కంపెనీలు కళ్లకు అద్దుకుని మరీ తీసేసుకుంటాయనేది అందరి నమ్మకం.
అలాంటిది లక్నో ఐఏఎంకి చెందిన 2011 బ్యాచ్‌లో దాదాపు 72 మందికి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల మన పూర్వ విద్యార్థులంతా ప్లేస్‌మెంట్‌లు కనుగొనేందుకైనా ఒక్కసారి కలుద్దాం అంటూ వాట్సాప్ మెసేజ్‌లు పెట్టుకున్నారు. పైగా 2024 బ్యాచ్‌మేట్స్‌కు తెలిసిన నెట్‌వర్క్ పరిధిలో ఏదైనా రిక్రూట్‌మెంట్స్ ఉంటే కనక్కుందామని కూడా ఆ సందేశంలో ఉంది. 2011 బ్యాచ్‌లోని 72 మంది ప్లేస్‌మెంట్‌లు కనుగునడం కోసం అంతా ఒకచోట చేరాలనేది ఆ సందేశం సారాంశం. ఇప్పుడది నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
పైగా ఈ సందేశం ఒక్కసారిగా అందర్నీ ఆశ్యర్యానికి గురి చేసింది. దీంతో నెటిజన్లు ఒక్కో తీరులో స్పందించారు. ప్రస్తుతం బీ స్కూళ్ల పరిస్థితి ఇలా ఉందని ఒకరు కామెంట్ చేయగా, మరొకరూ మన అభివృద్ధి ఇలా ఉందంటూ ఆర్థిక వ్యవస్థను నిందించారు. అంతేగాదు నిరుద్యోగం ఎలా ఉందనేందుకు అద్దం పడుతుందంటూ కామెంట్ చేశారు. ఏదీఏమైనా ఉన్నత ఉద్యోగాల కోసం అయినా పూర్వ విద్యార్థులంతా ఆత్మీయ సమ్మేళనం అవ్వుదామనడం అందర్నీ ఒక్కసారిగా కలవరిపర్చిందన చెప్పాలి. ఎందుకంటే బయట మార్కెట్ పరిస్థితి ఎలా ఉందనేందుకు ఇదే నిదర్శనం. ఇప్పుడున్న ఫాస్ట్ టెక్నాలజీలో ప్రతీ క్షణం పోటీ పడుతూ అప్‌డేట్ కాకపోతే త్వరగా సెటిల్ అవ్వడం అన్నది కష్టమని చెప్పకనే చెబుతోంది ఈ ఘటన.
IIM Lucknow is reaching out to alumni to help them with placements.
— Ravi Handa (@ravihanda) January 31, 2024
It is “crucial to maintain the legacy of IIM Lucknow’s 100% placement record”.
It isn’t about 5-10 people but 72 candidates at IIM-L do not have a job.
Imagine the status at other B-schools. pic.twitter.com/uYaTCmY3h7
(చదవండి: చింతపల్లికి వందేళ్లుగా వస్తున్న ఆ అతిధుల జాడేది..! రెండేళ్లుగా కనిపించని..)
Comments
Please login to add a commentAdd a comment