ఢిల్లీ: కొన్నేళ్లుగా జమ్ము కశ్మీర్‌ను ఎవరూ పట్టించుకోలేదని.. ఇవాళ ఇక్కడి నుంచి అభివృద్ధి పనుల్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం జమ్మూ నుంచి ఐఐటీ, ఐఐఎం, నవోదయ లాంటి విద్యాసంస్థలను ప్రారంభించి జాతికి అంకితం చేశారాయన.
దేశంలోని 20 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 13 కొత్త నవోదయ విద్యాలయ భవనాలను కూడా మోదీ ప్రారంభించారు. జమ్ము కశ్మీర్ నుంచి ఇలాంటి కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉంది. కొన్నేళ్లుగా జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదు. కుటుంబ రాజకీయాలు చేసేవాళ్లు.. వాళ్లకు లబ్ధి కలిగేలా మాత్రమే వ్యవహరిస్తారు. జమ్ముకశ్మీర్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. త్వరలో వికసిత్ కశ్మీర్‌కల సాకారం అవుతుంది. మోదీ గ్యారెంటీ అంటే ఇలా ఉంటుంది అని అన్నారాయన.
వర్చువల్‌గా పాల్గొన్న ఏపీ గవర్నర్, సీఎం జగన్
విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), తిరుపతి జిల్లాలో నెలకొల్పిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఐసర్ ప్రాంగణాలను ప్రధాని మోదీ జమ్మూ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా పాల్గొన్నారు.
విశాఖ ఐఐఎంకు సంబంధించి 2016 నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాత్కాలిక క్యాంపస్ నిర్వహిస్తున్నారు. ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో స్థలం కేటాయించి మొదటి దశ శాశ్వత భవనాలు పూర్తి చేశారు. తిరుపతి జిల్లా ఏర్పేడుకు సమీపంలోని ఐఐటీ, శ్రీనివాసపురంలోని ఐసర్ భవనాలను పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment