Identified
-
సీల్‌కు రేబిస్.. తొలి కేసును గుర్తించిన శాస్త్రవేత్తలు
కేప్ టౌన్: సముద్రపు క్షీరదం సీల్‌కు రేబిస్ సోకడాన్ని మొదటిసారిగా దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గుర్తించారు. సీల్స్ ఎక్కువగా అంటార్కిటిక్ జలాల్లో కనిపిస్తాయి. ఇవి చల్లని ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకుంటాయి. దక్షిణాఫ్రికాకు చెందిన ప్రభుత్వ పశువైద్యుడు డాక్టర్ లెస్లీ వాన్ హెల్డెన్ మీడియాతో మాట్లాడుతూ దక్షిణాఫ్రికా పశ్చిమ, దక్షిణ తీరాలలోని వివిధ ప్రదేశాలలో 24 కేప్ సీల్స్ రేబిస్‌తో బాధపడుతూ మృతిచెందాయని తెలిపారు.క్షీరదాలను రేబిస్ అమితంగా ప్రభావితం చేస్తుంది. వాటి నుంచి వైరస్ మనుషులకు సోకుతుంది. రేబిస్ సోకితే అది ప్రాణాంతకంగా మారుతుంది. రేబిస్ అనేది లాలాజలం ద్వారా లేదా జంతువులు కరవడం ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ను రకూన్లు, కొయెట్లు, నక్కలు, పెంపుడు కుక్కలలో చాలా కాలం క్రితమే కనున్నారు. అయితే సముద్రపు క్షీరదాలలో రేబిస్ వైరస్ కేసు ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు.1980ల ప్రారంభంలో నార్వేలోని స్వాల్బార్డ్ దీవుల్లోని సముద్రపు క్షీరదాల్లో రేబిస్‌కు సంబంధించిన ఒక కేసును గుర్తించారు. అయితే సీల్స్‌లో రేబిస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. దక్షిణాఫ్రికాలోని శాస్త్రవేత్తలు తొలిసారిగా కేప్ టౌన్ బీచ్‌లో ఒక కుక్కను సీల్ కరిచినప్పుడు ఆ సీల్లో రేబిస్‌ను గుర్తించారు. ఆ కుక్కకు రేబిస్ సోకింది. అనంతరం పరిశోధకులు 135 సీల్ మృతదేహాల మెదడు నమూనాలలో రేబిస్ ఆనవాళ్ల కోసం పరీక్షలు మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలో 20 కొత్త నమూనాలను కూడా సేకరించారు. తదుపరి పరీక్షలో మరిన్ని రేబిస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. శాస్త్రవేత్తలు ఇప్పుడు సీల్స్కు రేబిస్ ఎలా సోకుతుంది? వాటిలో వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తుందా? దీనిని అరికట్టడానికి ఏమి చేయాలనే దానిపై పరిశోధనలు సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: పాండాలకు బదులు.. -
HYD: డేటా చోరీ కేసులో రంగంలోకి దిగిన ఆర్మీ
సాక్షి, హైదరాబాద్: డేటా చోరీ కేసులో ఆర్మీ రంగంలోకి దిగింది. సైబరాబాద్ పోలీసులతో రక్షణ రంగ ఉన్నతాధికారుల భేటీ అయ్యారు. 2.55 లక్షల మంది తమ ఉద్యోగుల వివరాలు ఉండటంపై ఆరా తీశారు. జాతీయ భద్రతకు ముప్పు కావడంతో ఆర్మీ సీరియస్‌గా దృష్టి సారించింది. నిందితుల వద్ద జాతీయ రాజధాని పరిధిలో పని చేసే 2.55 లక్షల మంది డేటా లభ్యం కాగా, తమ ఉద్యోగుల డేటా నకలు ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డేటా లీకేజీ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కేసులో భాగంగా డేటా ప్రొవైడర్ జస్ట్ డయల్‌ను కూడా పోలీసులు విచారించనున్నారు. సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన సిట్ ద్వారా కేసు విచారణ చేపట్టనున్నారు. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న డేటాను తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అండ్ సైబర్ సేఫ్టీ ద్వారా పోలీసులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్‌లో డేటాచోరీకి సంబంధించి నగరానికి చెందిన వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
నకిలీ నోట్ల వ్యవహారం పై సమగ్ర దర్యాప్తు
-
నకిలీ చలాన్లు గుర్తింపు
-
1188 మంది నేరస్తుల గుర్తింపు
ఖమ్మంక్రైం : సమగ్ర సర్వేలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1188 మంది నేరస్తులను గుర్తించినట్లు సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. బుధవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నేరస్తుల విరాలును ఆన్లైన్లో టీఎస్ కాప్ యాప్‌లో అప్లోడ్ చేస్తామన్నారు. అదే విధంగా వారి నివాస గృహాలను గూగుల్ మ్యాప్ ద్వారా జియో ట్యాగింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. నేర ప్రవృత్తికి అలవాటు పడ్డవారిని గుర్తించి వారిలో మార్పు తీసుకొచ్చేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పదేళ్ల నాటి రికార్డుల ప్రకారం పదేపదే ప్రాపర్టీ దొంగతనాలు, దోపిడీలు చేసే 2097 మంది నేరగాళ్ల వివరాలు , చిరునామా, ప్రస్తుతం ఎక్కడుంటున్నారు, వారి స్థితిగతులపై సమాచారం సేకరించామన్నారు. కొంతమంది సత్పవర్తనతో మంచి జీవన విధానం కొనసాగిస్తున్నారన్నారు. మరి కొందరు మృతిచెందినట్లు సర్వేలో తెలిసిందన్నారు. 2008–2017 మధ్య దొంగతనాలు, హత్యలు , అత్యాచారాలు ఆర్థిక తదితర నేరాలు ఒకటి కంటే ఎక్కువ పాల్పడి అరెస్ట్ అయిన వారు 11,147మంది ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 1188 మంది పదేపదే ప్రాపర్టీ దొంగతనాలు, దోపిడీలకు చేస్తున్నారని వీరిపై మాత్రం నిరంతరం పోలీస్ నిఘా ఉంటుందని తెలిపారు. -
జిల్లాలో 182 సారా రహిత గ్రామాలు
చింతలపూడి: జిల్లాలో 182 సారా రహిత గ్రామాలుగా గుర్తించినట్టు, జిల్లా మొత్తాన్ని సారా రహితంగా తీర్చిదిద్దేందుకు కషి చేస్తున్నట్టు ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ వైవీ భాస్కరరావు అన్నారు. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం 400 మంది విద్యార్థినులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, క్రీడా సామగ్రి అందజేశారు. నవోదయం కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే సారా తయారీదారులు, అమ్మకం దారుల్లో మార్పు తీసుకువచ్చామన్నారు. దీనిలో భాగంగా ఆయా గ్రామాల్లో సదస్సులు నిర్వహించి చైతన్యం తీసుకువస్తున్నామన్నారు. యువజన సంఘాలను గుర్తించి 230 వాలీబాల్ కిట్లు అందజేశామని చెప్పారు. ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకుడు గుంతలు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎక్సైజ్ సిబ్బంది సహకారంతో యువతకు పోటీ పరీక్షలకు అవసర మైన పుస్తకాలను అందజేస్తున్నామని చెప్పారు. కౌన్సెలింగ్ ద్వారా నల్లబెల్లం అమ్మకాలను అరికట్టామని తెలిపారు. సీఐ సత్యనారాయణ, ఎసై ్స అష్రఫున్నీసా బేగం, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ జి.భారతి, బ్రాహ్మణేశ్వరి, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆంజనేయస్వామి విగ్రహం లభ్యం
కొల్లిపర : కృష్ణానదికి సమీపంలో ఉన్న కొల్లిపర వంతెన వద్ద, నది కరకట్ట వెంట గుర్తుతెలియని వ్యక్తులు ఆంజనేయస్వామి ప్రతిమను వదిలి వెళ్లారు. అయిదు అడుగుల మేర ఉన్న ప్రతిమను గురువారం ఉదయం చూసిన రైతులు గ్రామంలో తెలియచేశారు. విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు, గ్రామస్తులు స్థానిక శ్రీజనార్దనస్వామి ఆలయంలో సమావేశమై మందిరం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించి ప్రతిమ లభించిన చోటనే ప్రతిషి్ఠంచారు. అర్చకులు పరాశరం జగన్నాధాచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి విగ్రహప్రతిష్ఠ కావించారు. మందిరం నిర్మాణంతో పాటు పలు పనులు చేసేందుకు గ్రామస్తులు, పెద్దలు ముందుకు వచ్చారు. పుష్కరాల సమయానికి దిమ్మెకట్టేందుకు చర్యలు ప్రారంభించారు. కాగా, ఈ ప్రతిమ ఇక్కడకు ఎలా వచ్చిందనే దానిపై చర్చించుకుంటున్నారు. దావులూరు అడ్డరోడ్డు నుంచి ఎవరైనా కొల్లిపర మెయిన్‌రోడ్డు మీదుగా కరకట్ట వద్దకు తీసుకువచ్చి ఉంటే కొల్లిపరలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదు అయి ఉండవచ్చనే భావన అందరిలో నెలకొంది. దీనిని ఎక్కడి నుంచి తెచ్చారు? ఏదైన దేవస్థానం నుంచి అపహరించారా? లేక విజయవాడలో కూల్చివేసిన దేవాలయానికి సంబంధించిందా? కొత్తగా చెక్కిందా? అనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
మెక్సికోలో ఏలియన్ చేప!
మెక్సికోలో ఓ అరుదైన చేప జాలర్ల చేతికి చిక్కింది. ఇంతకుముందు అల్బినో షార్క్ జాతికి చెందిన ఇలాంటి చేపలను ఎక్కడా చూడకపోవడంతో అరుదుగా కనిపించిన ఈ వింత ఆకారాన్ని గ్రహాంతర జీవిగా వారు భావించారు. అందుకే దాన్ని ఏలియన్ ఫిష్ అని పిలుస్తున్నారు. మనిషి చర్మాన్ని పోలిన చర్మం, కొంతవరకు మానవ శరీరాకృతిలో కనిపిస్తున్న అల్బినో షార్క్‌ను మెక్సికోలోని ఓ ప్రాంతంలో నీటి అడుగు భాగాన గుర్తించారు. తెలుపు, గులాబీ రంగుల కలయికతో ఉన్న చర్మం... అటు చేప, ఇటు మానవ శరీరాకృతులను పోలి ఉన్న అల్బినో ఫిష్‌ను కాబో సమీపంలో వేటకు వెళ్లిన జామీ రెన్డాన్ ఓడలోని ఓ జాలరి గుర్తించాడు. ఆకురాయిలా గరుకుగా ఉన్న చర్మంతోనూ, మూడు వరుసల పళ్లతోనూ, తలకు ఇరువైపులా మూడు గ్రిల్స్ లాంటి రంధ్రాలతోనూ ఈ వింత చేప శరీరం ఉందని రెన్డాన్ తెలిపాడు. ఆ చేప కనిపించగానే ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యానని, నిజంగా దాని కళ్లు మనిషి కళ్లలా చాలా విచిత్రంగా ఉన్నాయని అతడు ప్రిస్సెస్ స్పార్ట్ ఫిషింగ్ ఫ్లీట్ పేరున కొనసాగుతున్న ఓ బ్లాగ్‌కు షార్క్ వివరాలను వెల్లడించాడు. అనంతరం నిపుణులు ఈ తెల్లని చేపను అల్బినో స్వెల్ షార్క్‌గా గుర్తించారని, ఈ గ్రహాంతర జీవి ప్రమాదంలో ఉండటంతోనే బయటకు వచ్చి ఉంటుందని భావిస్తున్నారని రెన్డాన్ తెలిపాడు. తమకు చిక్కిన ఆ ఏలియన్ చేపను నిపుణులు గుర్తించిన తర్వాత తిరిగి జాగ్రత్తగా నీటిలోకి పంపించినట్లు జాలర్లు చెబుతున్నారు. ఈ చేపలు మనుషులకు ఎలాంటి హాని కలిగించవని, వాటికి హాని కలిగిస్తారనుకున్న జీవులు కానీ, మనుషులు కానీ కనిపించినపుడు ప్రాణరక్షణ కోసం అవి కడుపు నిండా నీటిని నింపి ఆకారాన్ని అతి పెద్దగా మార్చుకుంటాయని నిపుణులు తెలిపారు. -
తూచ్ అన్న బెల్జియం మీడియా..
బ్రసెల్స్: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో బాంబు దాడులకు కారణమైన కీలక ఉగ్రవాదిని మరో ఇద్దరు అనుమానిత ఆత్మహుతి దాడి సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని బెల్జియం మీడియా ప్రకటించింది. ఆ వెంటనే తన సమాచారాన్ని వెనక్కి తీసుకుంది. తొలుత వారికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలు ఉన్నాయని మీడియా స్పష్టం చేసింది. వీరంతా పారిస్ దాడులకు పాల్పడినవారితో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నవారేనంటూ తెలిపింది. ఎయిర్ పోర్ట్ లోని సీసీటీవీ ఫుటేజీలో చూపించిన ప్రకారం నజీమ్ లాచ్రౌయి(25) అనే వ్యక్తి ట్రాలీలో బ్యాగులతో వెళుతూ కనిపించాడని, అనంతరం కాసేపటికే ఎయిర్ పోర్టు బయటకు పరుగులు తీశాడని తెలిపింది. అండర్లెక్ట్ అనే ప్రాంతంలో అతడిని అదుపులోకి పోలీసులు తీసుకున్నారని వెల్లడించింది. అయితే, మరికాసేపటికే మాటమార్చి అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఉగ్రవాది నజీమ్ కాదని తెలిపింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేసేందుకు అధికారులు ముందుకు రాలేదు. బెల్జియం రాజధాని బ్రసల్స్‌లో తీవ్రవాదులిద్దరూ ఆత్మాహుతి దాడులకు పాల్పడటంతో 30మందికి పైగా దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.