జిల్లాలో 182 సారా రహిత గ్రామాలు
జిల్లాలో 182 సారా రహిత గ్రామాలు
Published Tue, Jul 26 2016 6:26 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
చింతలపూడి: జిల్లాలో 182 సారా రహిత గ్రామాలుగా గుర్తించినట్టు, జిల్లా మొత్తాన్ని సారా రహితంగా తీర్చిదిద్దేందుకు కషి చేస్తున్నట్టు ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ వైవీ భాస్కరరావు అన్నారు. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం 400 మంది విద్యార్థినులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, క్రీడా సామగ్రి అందజేశారు. నవోదయం కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే సారా తయారీదారులు, అమ్మకం దారుల్లో మార్పు తీసుకువచ్చామన్నారు.
దీనిలో భాగంగా ఆయా గ్రామాల్లో సదస్సులు నిర్వహించి చైతన్యం తీసుకువస్తున్నామన్నారు. యువజన సంఘాలను గుర్తించి 230 వాలీబాల్ కిట్లు అందజేశామని చెప్పారు. ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకుడు గుంతలు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎక్సైజ్ సిబ్బంది సహకారంతో యువతకు పోటీ పరీక్షలకు అవసర మైన పుస్తకాలను అందజేస్తున్నామని చెప్పారు. కౌన్సెలింగ్ ద్వారా నల్లబెల్లం అమ్మకాలను అరికట్టామని తెలిపారు. సీఐ సత్యనారాయణ, ఎసై ్స అష్రఫున్నీసా బేగం, ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ జి.భారతి, బ్రాహ్మణేశ్వరి, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement