in west
-
ఆశల ఏరువాక
కొవ్వూరు : రబీ సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతుండగా.. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు అంటున్నారు. త్వరితగతిన నారుమడులు పూర్తి చేయాలని సూచిస్తున్నారు. మెట్టప్రాంత రైతులు బోరు బావుల ఆధారంగా ఇప్పటికే నారుమడులు పోయగా.. డెల్టాలోని ఎగువ రైతులు నారుమడుల్లో దుక్కులు మొదలు పెట్టారు. దిగువ, మధ్య డెల్టాల్లో సాగు పనులు చేపట్టేందుకు మరో 10 రోజులు వేచిచూడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 2.23 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తుండగా.. ఇందుకోసం 11,500 హెక్టార్లలో నారుమడులు పోయాల్సి ఉంది. ఇప్పటివరకు మెట్ట ప్రాంతంలోని 200 హెక్టార్లలో నారు పోశారు. ఆరంభంలోనూ సమస్యలే ఈనెల 10వ తేదీ నాటికి నారుమడుల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, జల వనరుల శాఖ అధికారులకు కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశాలిచ్చారు. ఆ గడువు నాటికి నారు పోసే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు నాలుగు రోజుల క్రితం నీరు విడుదల చేశారు. మొదట 100 క్యూసెక్కులు మాత్రమే ఇవ్వగా.. క్రమంగా ఆ మొత్తాన్ని 4,500 క్యూసెక్కులకు పెంచారు. అయితే, ప్రధాన కాలువల నుంచి పంపిణీ కాలువలకు ఇంకా నీరు చేరలేదు. దీనికి తోడు డెల్టా ఆధునికీకరణ పనులు కొలిక్కి రాలేదు. కాలువల మధ్య నిర్మాణ పనులు చేస్తుండటంతో నీటి ప్రవాహానికి ఆటం కాలు ఏర్పడ్డాయి. మరోవైపు ఎక్కడికక్కడ కర్రనాచు, గుర్రపు డెక్క, తూడు పేరుకుపోవడంతో నీరు ముందుకు పారడం లేదు. ఫలితంగా బ్రాంచి కెనాల్స్, పంట బోదెలకు ఇప్పటికీ నీరు చేరలేదు. ఏలూరు ప్రధాన కాలువకు 548 క్యూసెక్కులు, జీ అండ్ వీ కెనాల్‌కు 309, నరసాపురం (కాకరపర్రు) కాలువకు 1,343, ఉండి కాలువకు (శెట్టిపేట) 703 క్యూసెక్కుల చొప్పున నీరు వదులుతున్నారు. అత్తిలి కాలువకు మాత్రం ఇంకా నీరివ్వలేదు. విత్తనాల విక్రయానికి బయోమెట్రిక్ విధానం రబీ విత్తనాల పంపిణీకి అధికారులు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తుండటంతో ముందస్తు సాగు సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కౌలు రైతులతోపాటు భూ యజమానులకు బయోమెట్రిక్ విధానంలోనే విత్తనాలు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇది రైతుల్లో గుబులు రేపుతోంది. కౌలు రైతులు సర్వే నంబర్‌తోపాటు ఎల్ఈసీ కార్డులు, సాగు చేస్తున్నట్టు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే తప్ప విత్తనాలు అందని పరిస్థితి నెలకొంది. 30 కేజీల విత్తనాల బస్తాపై రూ.150 సబ్సిడీ అందిస్తున్నారు. రుతు పవనాలపైనే ఆశలు రెండేళ్లుగా ఖరీఫ్‌లో వర్షాలు దోబూచులాడుతున్నాయి. గత ఏడాది జూ¯ŒSలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. సరాసరి వర్షపాతం కంటే 162.1 మిల్లీవీుటర్ల అదనంగా నమోదైంది. 2015లో జూ¯ŒSలోనూ ఇదే పరిస్థితి. ఆ ఏడాది సరాసరి కంటే 158.3 మిల్లీమీటర్లు అదనంగా వర్షం కురిసింది. ఆ రెండేళ్లలోనూ జూలై నెలలో వరుణుడు మొహం చాటేశాడు. దీంతో రైతులు నారుమడుల దశలోనే ఇబ్బందులు చవిచూశారు. దీనివల్ల నాట్లు ఆలస్యమయ్యాయి. ఫలితంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో పంటలు తుపాన్ల ప్రభావానికి గురై దెబ్బతి న్నాయి. ఈ ఏడాది వాతావరణం ఆశాజనకమేని నిపుణులు చెబుతున్నారు. జూన్, జూలై నెలల్లో అధిక వర్షాలు కురుస్తాయంటున్నారు. విత్తనాలు రెడీ జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి 1.24 లక్షల టన్నుల విత్తనాలు, 1.83 లక్షల టన్నుల ఎరువులు సిద్ధం చేశాం. ఈనెల 10వ తేదీ నాటికి నారుమడులు పోసుకోవాలని రైతులకు సూచిస్తున్నాం. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు తక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. అందువల్ల జూలై నెలాఖరు నాటికి నాట్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.– వై.సాయిలక్ష్మీశ్వరి, జాయింట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ -
కానిస్టేబుల్ ఉద్యోగాల రాతపరీక్షకు ఏర్పాట్లు
ఏలూరు (ఆర్ఆర్ పేట)/భీమవరం : పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6న నిర్వహించనున్న రాత పరీక్షల నిమిత్తం జిల్లా అభ్యర్థుల కోసం ఏలూరు, భీమవరంలో పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్టు ఆయా కేంద్రాల రీజనల్ కోఆర్డినేటర్లు గుత్తా సాంబశివరావు, పెన్మెత్స రామకృష్ణంరాజు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. జిల్లాలో మొత్తం 14,289 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్టు చెప్పారు. వీరికోసం ఏలూరులో 20 పరీక్ష కేంద్రాలు, భీమవరంలో 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందన్నారు. అభ్యర్థులు పరీక్షకు అరVýæంట ముందు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. -
11 నుంచి ‘మన గుడి’
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : హిందూ ధర్మ ప్రచార పరిషత్, దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 8వ విడత మన గుడి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్. దుర్గాప్రసాద్, ధర్మ ప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు ఎంవీఎస్.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు తెలిపారు. సమావేశంలో టీఎస్.రవికుమార్, కెవీ.నరసింహాచార్యులు, ఎస్ఎస్.చక్రధర్, జీవీ.నాగేశ్వరరావు, సీహెచ్. సత్యనారాయణరాజు పాల్గొన్నారు. -
సరస్వతీ.. నమస్తుభ్యం
శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా జిల్లాలోని అమ్మవార్లను శనివారం చదువుల తల్లి సరస్వతీ దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో సరస్వతీయాగాలు నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకువచ్చి దేవీ సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించారు. సరస్వతీ నమస్తుభ్యం.. వరదే కామరూపిణి.. ప్రార్థనలతో ఆలయ ప్రాంగణాలు దద్దరిల్లాయి. -
ప్రమాదం.. విషాదం
జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఉండిలో లారీ ఢీకొని పెయింటర్ మృతిచెందాడు. టి.నరసాపురం మండలం సాయంపాలెం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని భార్యాభర్తలు, ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం వద్ద ఆటోను మోటార్‌సైకిల్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు క్షతగాత్రులయ్యారు. ఆటోను ఢీకొట్టిన బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు ద్వారకాతిరుమల : ఆటో, మోటారు సైకిల్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. పెదవేగి మండలం రామసింగవరానికి చెందిన కొమ్మికూరి రాటాలు, తాళ్లూరి రవి ద్విచక్ర వాహనంపై ద్వారకాతిరుమలకు వచ్చారు. పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి పయనమయ్యారు. తిమ్మాపురం శివారు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఆటోను గమనించకుండా ఢీకొట్టారు. దీంతో ఆటో, మోటార్‌సైకిల్ ధ్వంసమయ్యాయి. మోటారు సైకిల్‌పై ఉన్న రాటాలు, రవి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను 108 ఆంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు ఢీకొని భార్యాభర్తలకు గాయాలు టి.నరసాపురం : ఆర్టీసీ బస్సు ఢీకొని భార్యాభర్తలకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కామవరపుకోటకు చెందిన చవల నాగరాజు, అతని భార్య గురువారం టి.నరసాపురం మండలం తిరుపతిపాడుకు సైకిల్‌పై వస్తుండగా, సాయంపాలెం సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో వారిద్దరూ గాయపడ్డారు. స్థానికులు వారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎసై ్స కె.నాగేంద్రప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఢీకొని పెయింటర్ మృతి ఉండి : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు బుధవారం అర్ధరాత్రి దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. కోలమలూరులో పెయింటర్‌గా పనిచేస్తున్న కాలా పవన్‌కుమార్(22) బుధవారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చి భోజనం చేశాడు. ఆ తర్వాత ఉండి వెళ్లొస్తానని చెప్పి వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. ఉండి సెంటర్లో బుధవారం అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో అతను ఉండి నుంచి కోలమూరు వెళ్లేందుకు గణపవరం వైపు వెళ్తున్న లారీని ఆపేందుకు యత్నించాడు. ఈ క్రమంలో లారీ ఢీకొనడంతో వెనుక చక్రం కింద పడ్డాడు. దీంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని మతదేహాన్ని భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మతుని వివరాలు గురువారం ఉదయం వరకు తెలియకపోవడంతో పోలీసులు అతని ఫొటో సాయంతో చుట్టు పక్కల గ్రామాల్లో విచారణ చేపట్టారు. చివరకు అతను కోలమూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. హెడ్ కానిషే్టబుల్ ఎం.ధర్మారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దేవుళ్లకు మొక్కాను.. పూజించ వచ్చాను
పెదవేగి రూరల్/ద్వారకా తిరుమల : రియో ఒలింపిక్స్‌లో భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం ద్వారకాతిరుమల చినవెంకన్న, రాట్నాలకుంట రాట్నాలమ్మను దర్శించుకున్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు రాట్నాలమ్మ, చినవెంకన్న, మద్ది ఆంజనేయస్వామికి మొక్కుకున్నానని, ఆ మొక్కులు తీర్చుకునేందుకు వచ్చానని చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి చినవెంకన్నకు పూజలు చేసిన అనంతరం రాట్నాలమ్మ దర్శనానికి వెళ్లారు. అక్కడ సంప్రదాయబద్ధంగా పాల పొంగలి వండి.. ఆ పాత్రను తలపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. లక్ష్యంపై గురి పెడితే గెలుపు తలుపు తెరుచుకుంటుందని ఈ సందర్భంగా యువతకు దిశానిర్దేశం చేశారు. ఈ స్వాగతం జీవితంలో మరచిపోలేను ఒలింపిక్ క్రీడల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిచెప్పిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం జిల్లాలోని ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయాన్ని, పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాట్నాలమ్మ దేవస్థానానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన సింధుకు స్థానిక నాయకులు పుష్పగుచ్ఛం అందించిన అనంతరం గోపన్నపాలెం వ్యాయామ కళాశాల విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. సింధు భక్తిశ్రద్ధలతో రాట్నాలమ్మను దర్శించుకుని రియో ఒలింపిక్స్‌కు వెళ్లేముందు మొక్కుకున్న మొక్కుబడులను తీర్చుకున్నారు. ప్రసాదాన్ని తలపై పెట్టుకుని సంప్రదాయబద్ధంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్థానిక నాయకులు, దేవస్థాన సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించి రాట్నాలమ్మ అమ్మవారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. అనంతరం సింధు విలేకరులతో మాట్లాడుతూ రాట్నాలమ్మ దయవల్ల తాను ఈ స్థాయికి ఎదిగానని, తన ఆటలో అమ్మవారు వెన్నంటే ఉన్నట్టే భావించి నిరంతరం కష్టపడి భారతదేశానికి పతకం సా«ధించానని చెప్పారు. ఈ విజయం వెనుక అటు చిన తిరుపతి వెంకన్నస్వామి, ఇటు రాట్నాలమ్మ, మద్ది ఆంజనేయస్వామి ఆశీస్సులు అడుగడుగునా తనకు ఉన్నాయని, అందుకే అమ్మవారిని స్వయంగా వచ్చి దర్శించుకున్నానని చెప్పారు. తన జీవితంలో మరుపురాని ఘనస్వాగతం అమ్మవారి సన్నిధిలో లభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ స్వాగతాన్ని జీవితంలో ఎన్నడూ మరచిపోలేనని చెప్పారు. కార్యక్రమంలో రాట్నాలకుంట ఆలయ కమిటీ చైర్మన్ రాయల భాస్కరరావు, పెదవేగి ఎంపీపీ దేవర పల్లి బక్కయ్య, ఏలూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ముంచిన వాన
సాక్షి, నెట్వర్క్ : జిల్లాను రెండు రోజులు ముంచెత్తిన వర్షాలు శనివారం కాస్త ఉపశమనం కలిగించాయి. అక్కడక్కడ వర్షాలు పడినప్పటికీ తీవ్రత అంతగా లేదనే చెప్పొచ్చు. ముంపునీరు కాస్త తొలగడంతో పంటపొలాలు బయటపడుతున్నాయి. పలుచోట్ల వరి నేలనంటగా కొన్నిచోట్ల ధాన్యం మొలకలు వచ్చి రైతన్నను ఆవేదనకు గురి చేసింది. రైతులు ముంపునీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన కాలువల్లో ప్రవాహ ఉధృతి తగ్గలేదు. ఏజెన్సీలోనూ వాగులు ఇంకా పొంగిపొర్లుతున్నాయి. మొత్తంగా అల్పపీడన ప్రభావంతో కురిసిన వాన జిల్లాను నష్టాల్లో ముంచిందనే చెప్పొచ్చు. -
రేపటి నుంచి స్కూల్‌గేమ్స్ సెలెక్షన్స్
తణుకు: జాతీయ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను ఈనెల 12 నుంచి పలు ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు జిల్లా స్కూల్‌గేమ్స్ సెక్రటరీ ఎ.సాయిశ్రీనివాస్ తెలిపారు. 12న ద్వారకాతిరుమల మండలం రాజాపంగిడిగూడెం జెడ్పీ హైస్కూల్లో విలువిద్య పోటీలు, 14న చాగల్లు జెడ్పీ హైస్కూల్లో వాలీబాల్ పోటీలు, 15న గోపన్నపాలెం సీతారామ ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో ఖోఖో, కబడ్డీ, హేండ్‌బాల్, టెన్నిస్, యోగా, అథ్లెటిక్స్ పోటీలు, 16న భీమవరం భారతీయ విద్యాభవన్స్‌లో హాకీ, రోప్‌స్కిప్పింగ్ పోటీలు, 17న ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో స్విమ్మింగ్, స్కేటింగ్, రోయింగ్, జూడో, తైక్వాండ్ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. -
నేలచూపులు
భీమవరం : జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చతికిలపడింది. కొత్త రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివద్ధి చేస్తామని.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబెడతామని.. అన్ని స్థానాలు ఇచ్చిన పశ్చిమగోదావరి జిల్లాను అభివద్ధిలో అగ్రభాగాన నిలబెడతామని పాలకులు నమ్మబలకడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉత్సాహంతో జిల్లావ్యాప్తంగా కొత్త వెంచర్లు వేశారు. చివరకు అభివద్ధి అంతా నూతన రాజధాని అమరావతి ప్రాంతానికే పరిమితం కావడంతో రెండేళ్లుగా జిల్లాలో స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలు స్తంభించిపోయాయి. ఫలితంగా కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి భూములు కొనుగోలు చేసిన వ్యాపారులు దారుణంగా దెబ్బతిన్నారు. స్థలాలు అమ్ముడుకాకపోవడంతో రియల్ ఎస్టేట్ భూముల్లో యూకలిప్టస్ తోటలు వేయడం, కూరగాయలు, ఆకు కూరలు పండించడం చేస్తున్నారు. ఒక్క ‘పశ్చిమ’లోనే గడచిన రెండేళ్లలో రూ.వెయ్యి కోట్లకు పైగా లావాదేవీలు నిలిచిపోయాయని అంచనా. రాష్ట్ర నూతన రాజధాని గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం వంటి నగరాల్లో ఏర్పాటు చేయబోతున్నామంటూ టీడీపీ నాయకులు విస్తతంగా ప్రచారం చేశారు. జిల్లా కేంద్రమైన ఏలూరు సమీపంలో రాష్ట్ర రాజధాని ఏర్పాటైతే అభివద్ధిలో మన జిల్లా ముందుకు దూసుకుపోతుందని భావించారు. ఇక్కడి గహాలకు ఎక్కడాలేని డిమాండ్ ఏర్పడుతుందని ప్రచారం సాగింది. దీంతో ఏలూరుతోపాటు భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, జంగారెడ్డిగూడెం తదితర పట్టణాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఊపు వచ్చింది. – విపరీతంగా పెరిగిన ధరలు రాష్ట్ర రాజధాని ఇక్కడకు సమీపంలోనే ఉంటుందన్న ప్రచారంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ మొత్తాలు వెచ్చించి ఈ ప్రాంత భూముల్ని కొనుగోలు చేశారు. భీమవరం పరిసర గ్రామాల్లో ప్రధాన రహదారి వెంబడి ఉండే వ్యవసాయ భూముల ధర గతంలో ఎకరం రూ.25 లక్షల లోపు మాత్రమే ఉండేది. రాజధాని పేరుతో ఎకరం రూ.కోటి నుంచి రూ.3 కోట్ల వరకు పెరిగిపోయింది. ఇక పట్టణ పరిసర ప్రాంతాల్లో అయితే గజం భూమి రూ.లక్ష వరకు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎకరాన్ని రూ.కోటికి కొని, వాటిని పూడ్చి, ప్లాట్లుగా విభజించి అమ్మకానికి పెట్టేసరికి ఎకరం విలువ రూ.2 కోట్ల వరకు అయ్యింది. సెంటు భూమిని రూ.2.25 లక్షలకు విక్రయించగలిగితే వ్యాపారులకు పెట్టుబడి వచ్చేది. కానీ.. ఆ మాత్రం ధరకు కొనేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి. నిలిచిపోయిన లావాదేవీలు జిల్లాలో సుమారు 4వేల మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులుండగా, దాదాపు 8 వేల ఎకరాల్లో ప్లాట్లు వేసినట్లు అంచనా. వీటిలో 60 శాతం ప్లాట్లు అమ్ముడు కాలేదని చెబుతున్నారు. భూముల ధరలు పెరిగిపోగా, ఖర్చులు కూడా అదేస్థాయిలో అయ్యాయి. దీనివల్ల ధరలు పెంచాల్సి వచ్చిందని రియల్టర్లు చెబుతున్నారు. రాష్ట్ర రాజధానిని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏర్పాటు చేయడంతో ఇక్కడి స్థలాలను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికి తోడు రిజిస్ట్రేషన్ చార్జీలు విపరీతంగా పెరిగిపోవడంతో స్థలాల కొనుగోలు తలకు మించిన భారంగా మారింది. ఫలితంగా అమ్మకాలు జరక్క ఎక్కడి ప్లాట్లు అక్కడే నిలిచిపోయాయి. వడ్డీలు కట్టలేక సతమతం రియల్టర్లలో అత్యధికులు పెట్టుబడుల నిమిత్తం వడ్డీ వ్యాపారుల నుంచి నిధులు సమీకరించారు. స్థలాల అమ్మకాలను త్వరితగతిన పూర్తిచేసి సొమ్ము చేసుకోవచ్చని ఆశించారు. స్థలాల కొనుగోళ్లు జరక్కపోవడంతో అప్పు తెచ్చిన సొమ్ములకు వడ్డీలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. కొందరైతే సొంత ఆస్తులను సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధాని కుంగదీసింది రాష్ట్ర రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుగా ఆప్రాంతంలో భూములు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. అక్కడ అనుకున్న స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. ఇదే తరుణంలో మన జిల్లాలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందుకు సాగడం లేదు. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి వెంచర్లు వేస్తే కొనుగోళ్లు జరగక వడ్డీలు కూడా కట్టలేక సతమతమయ్యే పరిస్థితి ఏర్పడింది. – తోట భోగయ్య, రియల్ ఎస్టేట్ వ్యాపారి, భీమవరం ధరలు పెరిగిపోయాయ్ రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకునే వారు ఇక్కడికొచ్చి భూముల ధరలను విపరీతంగా పెంచేశారు. దీనితో స్థలాల ధరలు కూడా పెరిగిపోయాయి. సొంత ఇంటి కోసం కొద్దిపాటి స్థలం కొనాలన్నా లక్షలకు లక్షలు పెట్టాల్సి వస్తోంది. అందువల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులకు సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతోంది. – కట్టా శ్రీనివాస్, వీరవాసరం -
కుండపోత
బుట్టాయగూడెం : జిల్లాలో ఆదివారం కుండపోత వాన కురిసింది. ఏజెన్సీలోని కొండవాగులు వరదనీటితో పోటెత్తాయి. మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా సాయంత్రం వరకూ వర్షం కురవడంతో మండలంలోని కే.ఆర్.పురం, అల్లి కాలువ, వీరన్న పాలెం, ఇప్పలపాడు సమీపంలోని జల్లేరువాగు, రామారావు పేట, పట్టినపాలెం సమీపంలోని వాగు, కోపల్లి సమీపంలోని కొవ్వాడ వాగులు పొంగిపొర్లాయి. అదేవిధంగా కొమ్ముగూడెం, కంగాలవారిగూడెం, కుమ్మరిగట్టు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లల్లోకి ప్రవేశించింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు నానా అవస్థ పడ్డారు. కొండవాగుల ప్రవాహం కారణంగా రాకపోకలకు అంతరాయం కలిగింది. తాళ్లచెరువు, బైనేరు వాగు, కొమ్ముగూడెం కాలువ, రెడ్డిగణపవరం కాలువ కళింగలు పొంగాయి. కుమ్మరిగట్టు సమీపంలో కొన్ని ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. జిల్లాలో 12.6 మి.మీటర్ల సరాసరి వర్షపాతం నమోదు కొవ్వూరు : గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఆదివారం 8 గంటల సమయానికి జిల్లాలో 12.6 మి.మీటర్లు సరాసరి వర్షపాతం నమోదైంది. బుట్టాయిగూడెం మండలంలో అత్యధికంగా 57.6 మి.మీటర్లు వర్షం కురిసింది. ఉండ్రాజవరంలో 43.6, కొయ్యలగూడెంలో 23.4, పెరవలిలో 32.8, తణుకులో 37.2, నల్లజర్లలో 28.4, పెనుమంట్రలో 16.8, తాడేపల్లిగూడెంలో 11.0, కుక్కునూరులో 14.2, వీరవాసరంలో 15.2, గోపాలపురంలో 12.2, వేలేరుపాడు లో17.4 మి.మీటర్లు చొప్పున నమోదైంది. ఇక మిగిలిన మండలాల్లో నామమాత్రంగా పది మి.మీటర్లు లోపు వర్షపాతం నమోదైంది. జీలుగుమిల్లి 3.2, నిడదవోలులో 9.0, ఇరగవరంలో 7.2, అత్తిలిలో 5.2, పాలకొల్లులో 5.8, భీమవరంలో 3.2, ఆచంటలో 9.4, పాలకోడేరులో 3.2, ద్వారకా తిరుమలలో 4.2 మి.మీటర్లు చొప్పున నమోదైంది. జిల్లాలో పలు చోట్ల భారీవర్షం పడగా కొన్ని చోట్ల మాత్రం చిరుజల్లులు మాత్రమే పడడం విశేషం. -
కుండపోత
బుట్టాయగూడెం : జిల్లాలో ఆదివారం కుండపోత వాన కురిసింది. ఏజెన్సీలోని కొండవాగులు వరదనీటితో పోటెత్తాయి. మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా సాయంత్రం వరకూ వర్షం కురవడంతో మండలంలోని కే.ఆర్.పురం, అల్లి కాలువ, వీరన్న పాలెం, ఇప్పలపాడు సమీపంలోని జల్లేరువాగు, రామారావు పేట, పట్టినపాలెం సమీపంలోని వాగు, కోపల్లి సమీపంలోని కొవ్వాడ వాగులు పొంగిపొర్లాయి. అదేవిధంగా కొమ్ముగూడెం, కంగాలవారిగూడెం, కుమ్మరిగట్టు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లల్లోకి ప్రవేశించింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు నానా అవస్థ పడ్డారు. కొండవాగుల ప్రవాహం కారణంగా రాకపోకలకు అంతరాయం కలిగింది. తాళ్లచెరువు, బైనేరు వాగు, కొమ్ముగూడెం కాలువ, రెడ్డిగణపవరం కాలువ కళింగలు పొంగాయి. కుమ్మరిగట్టు సమీపంలో కొన్ని ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. జిల్లాలో 12.6 మి.మీటర్ల సరాసరి వర్షపాతం నమోదు కొవ్వూరు : గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఆదివారం 8 గంటల సమయానికి జిల్లాలో 12.6 మి.మీటర్లు సరాసరి వర్షపాతం నమోదైంది. బుట్టాయిగూడెం మండలంలో అత్యధికంగా 57.6 మి.మీటర్లు వర్షం కురిసింది. ఉండ్రాజవరంలో 43.6, కొయ్యలగూడెంలో 23.4, పెరవలిలో 32.8, తణుకులో 37.2, నల్లజర్లలో 28.4, పెనుమంట్రలో 16.8, తాడేపల్లిగూడెంలో 11.0, కుక్కునూరులో 14.2, వీరవాసరంలో 15.2, గోపాలపురంలో 12.2, వేలేరుపాడు లో17.4 మి.మీటర్లు చొప్పున నమోదైంది. ఇక మిగిలిన మండలాల్లో నామమాత్రంగా పది మి.మీటర్లు లోపు వర్షపాతం నమోదైంది. జీలుగుమిల్లి 3.2, నిడదవోలులో 9.0, ఇరగవరంలో 7.2, అత్తిలిలో 5.2, పాలకొల్లులో 5.8, భీమవరంలో 3.2, ఆచంటలో 9.4, పాలకోడేరులో 3.2, ద్వారకా తిరుమలలో 4.2 మి.మీటర్లు చొప్పున నమోదైంది. జిల్లాలో పలు చోట్ల భారీవర్షం పడగా కొన్ని చోట్ల మాత్రం చిరుజల్లులు మాత్రమే పడడం విశేషం. -
పరిశ్రమల స్థాపనకు చర్యలు
తాడేపల్లిగూడెం రూరల్ : జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నా పారిశ్రామికపరంగా వెనుకబడి ఉందని, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.భాస్కర్ అన్నారు. స్థానిక శశి ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ‘పశ్చిమలో పారిశ్రామికాభివృద్ధి అవకాశాలు–సీఐఐ మార్గదర్శకత్వం’ అంశంపై పారిశ్రామిక ప్రతినిధులతో సదస్సు నిర్వహించారు. వ్యవసాయాధారిత జిల్లా కావడంతో పశ్చిమ పారిశ్రామికపరంగా వెనుకపడి ఉందన్నారు. వ్యవసాయం, ఉద్యాన, మత్స్య సంపద విషయంలో జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందన్నారు. జిల్లాలో మరే ఇతర పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి లేకపోవడం బాధాకరమన్నారు. దీనికి తోడు రియల్ ఎస్టేట్ రంగంలో భూములపై లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. బ్యాంకుల అధిక వడ్డీలు పరిశ్రమల స్థాపనకు మోకాలొడ్డుతున్నాయన్నారు. అయినా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవకాశాలను సరళీకతం చేస్తామని కలెక్టర్ చెప్పారు. సవాళ్లను ఎదుర్కొంటేనే మనుగడ.. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జేఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ ఒకప్పుడు పరిశ్రమల జీవిత ప్రమాణం 56 ఏళ్లు ఉండగా ప్రస్తుతం 15 ఏళ్లకు తగ్గిపోయిందన్నారు. రానురాను ఈ స్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్లిన రోజే పరిశ్రమలకు మనుగడ ఉంటుందన్నారు. పరిశ్రమల పాత్ర కీలకం.. జిల్లా పరిశ్రమల శాఖ ఉప సంచాలకుడు వి.ఆదిశేషు మాట్లాడుతూ ఆర్థిక వృద్ధి, ఉపాధిలో పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. దేశంలో 2.60 కోట్ల యూనిట్ల ద్వారా 6.90 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని, వీటిలో 45 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు ఉన్నాయన్నారు. 2015–20కు గాను ప్రభుత్వం పాలసీని ప్రకటించిందని, వీటిని వినియోగించుకుని పారిశ్రామికవేత్తలు జిల్లాలో పరిశ్రమలను స్థాపనకు ముందుకు రావాలని కోరారు. శశి ఇంజినీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్, సీఐఐ విజయవాడ జోన్ అధికారి జి.వెంకటేశ్వరరావు మాట్లాడారు. అనంతరం అతిథులను కళాశాల యాజమాన్యం సత్కరించింది. పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
హేట్సాఫ్.. సింధు !
ఉద్విగ్న క్షణాలు వీడాయి. ‘జయహో సింధు’ నినాదాలు మిన్నంటాయి. విశ్వ క్రీడా వేదికపై బాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు ప్రదర్శించిన పోరాట పటిమకు ‘పశ్చిమ’ ప్రజానీకం జేజేలు పలికింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన తొలి భారతీయ మహిళగా రికార్డులకు ఎక్కిందని తెలిసి సంబరాలు జరుపుకుంది. సింధు పూర్వీకులు మన జిల్లా వాసులే. ఆమె తాతయ్య ఏలూరు నగరానికి చెందిన వారు. ఉద్యోగరీత్యా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు వెళ్లారు. సింధు తండ్రి పుసర్ల వెంకటరమణ అక్కడే జన్మించారు. విద్యుత్ శాఖలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అయినప్పటికీ మన జిల్లాతో ఆ కుటుంబానికి సంబంధ బాంధవ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సింధు, ఆమె కుటుంబ సభ్యులు ఏటా రెండు మూడుసార్లు పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలోని రాట్నాలమ్మ ఆలయానికి వస్తుంటారు. ఆ కుటుంబానికి రాట్నాలమ్మ అంటే ఎనలేని భక్తిభావం. సింధు రియో ఒలింపిక్స్‌కు వెళ్లడానికి ముందు జూన్ 19న కుటుంబ సభ్యులతో కలసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె తండ్రి వెంకటరమణ శుక్రవారం కూడా ఈ ఆలయానికి వచ్చారు. రాట్నాలమ్మ ఆశీస్సులు, కోట్లాదిమంది భారతీయుల దీవెనలే రియోలో సింధు రజత పతకాన్ని సాధించడానికి కారణమయ్యాయని వ్యాఖ్యానించారు. ఈనెల 25 లేదా 26వ తేదీన సింధుతో కలిసి అమ్మవారి దర్శనానికి వస్తామని చెప్పారు. జయహో సింధు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)ఫఒలింపిక్ పోటీల్లో భారత దేశం తరపున తెలుగు బిడ్డ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రజత పతకం సాధించడంతో నగరంలో యువత సంబరాలు చేసుకున్నారు. శేఖర్ చారి టబుల్ ట్రస్ట్ చైర్మన్ కమ్ముల సోమశేఖర్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చారు. అలాగే పీవీ సింధు రూపాన్ని నగరానికి చెందిన సూక్ష్మ కళారూపాల శిల్పి మేతర సురేష్ బాబు అగ్గిపుల్లపై చెక్కారు. -
దొరికినంతా దోచెయ్దే
ఏలూరు అర్బన్: కంటి రెప్పకు తెలియకుండా కనుగుడ్డును మాయం చేసేస్తున్నారు.. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నా మొత్తం కొల్లగొట్టేస్తున్నారు.. పగలూ రాత్రీ తేడాలేకుండా చోరీలు చేస్తున్నారు.. ఏటా వందలాది చోరీలు.. కోట్లాది రూపాయల విలువైన నగదు, బంగారం అపహరణకు గురవుతున్నా.. నిఘా వర్గాలు నిద్రలేవడం లేదు. అడపాదడపా దొంగలను అరెస్ట్ చూపించి మమ అనిపిస్తున్నారు.. జిల్లాలో నాలుగేళ్లుగా దొంగతనాల సంఖ్య పెరిగింది. జిల్లాలో దొంగలు చెలరేగిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లు లక్ష్యంగా చోరీలకు తెగబడుతున్నారు. వరుస దొంగతనాలతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాళాలు పగులగొట్టి ఇంట్లోని నగలు, నగదు మాయం చేస్తున్నారు. జిల్లాలో నాలుగేళ్లుగా చోరీల సంఖ్య పెరిగింది. కోట్లాది రూపాయల విలువైన బంగారు, వెండి వస్తువులు, నగదు అపహరణకు గురవుతున్నా పోలీసులు లక్షల్లో మాత్రమే రికవరీ చేయగలుగుతున్నారు. జిల్లాలో 2013లో 490, 2014లో 472, 2015లో 449 చోరీలు జరగ్గా ఈ ఏడాది జూలై నెల వరకు 285 దొంగతనాలు జరిగాయి. జిల్లాలో పోలీసు వ్యవస్థ నిద్రావస్థలో ఉందా అంటూ ప్రజలు మండిపడుతున్నారు. జూలైలో చోరీల విజృంభణ గతనెలలో దొంగలు మరింత రెచ్చిపోయారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ చోరీలకు పాల్పడ్డారు. జూలై 22: చాగల్లులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీవాణి ఇంటికి తాళాలు వేసుకుని బంధువుల ఇంటికి వెళ్లగా దొంగలు చోరీకి తెగబడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి 5 కాసుల బంగారు నగలు, వెండి సామగ్రి రూ.10 వేల నగదు అపహరించారు. జూలై 25: బుట్టాయిగూడెం మండలం ముప్పినవారిగూడెంకు చెందిన వెంకాయమ్మ అనే మహిళ వ్యక్తిగత పనులపై ఇంటికి తాళాలు వేసి పొరుగూరు వెళ్లింది. తిరిగి వచ్చే సరికి ఇంటి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. ఇంట్లోని ఐదు కాసుల బంగారు నగలు, రూ.5 వేలు మాయమయ్యింది. జూలై26: పెరవలి మండలం నల్లాకులవారిపాలెంలో ర్యాలి వేణుగోపాల దొరయ్య నాయుడు ఆస్పత్రిలో బంధువులను పరామర్శించేందుకు వెళ్లగా దొంగలు పడ్డారు. ఇంటి తాళాలు పగులకొట్టి బీరువాలోని అరకిలో వెండి రూ.3 లక్షలు దోచుకుపోయారు. జూలై 29: వేల్పూరుకు చెందిన వల్లూరి పాపారావు ఇంటికి తాళాలు వేసుకుని పొరుగూరు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి దొంగలు బీరువాలోని 32 కాసుల బంగారు నగలు, రూ.25 లక్షల నగదు చోరీ చేశారు. జూలై 30: ఏలూరులోని ఆర్ఎంఎస్ కాలనీలో వెంకటరామ్మూర్తి అనే ప్రైవేట్ పై పోర్షన్‌కు తాళాలు వేసి కింది పోర్షన్లో నిద్రపోయారు. ఇదే అదనుగా పై పోర్షన్ తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు 26 కాసుల బంగారు నగలు, రూ.50 వేల నగదు ఎత్తుకుపోయారు. జూలై 31: పాలకోడేరు మండలం వేండ్ర గ్రామానికి చెందిన నామాల రాంబాబు ఇంటికి తాళాలు వేసి పొరుగూరు వెళ్లారు. మరునాడు తిరిగి రాగా ఇంటి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. ఇంట్లోని 11 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆగస్టు 2: తణుకులోని సజ్జాపురంలో మల్లిపూడి నాగేశ్వరరావు ఇంటికి తాళాలు వేసి బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువా తాళాలు పగులకొట్టి 30 కాసు బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు దొంగలు దోచుకుపోయారు. ........................ జిల్లాలో చోరీలు.. రికవరీలు ఇలా సంవత్సరం చోరీల సంఖ్య చోరీ అయిన సొత్తు రికవరీ 2013 490 రూ.2,97,80,779 రూ.41,98,094 2014 472 రూ.3,18,81,700 రూ.72,01,900 2015 449 రూ.3,56,64,723 రూ.81,67,410 2016 జూలై వరకు 285 రూ.2,01,22,186 రూ.27,90,700 .......................... -
కళకళా గోదారి
పావన వాహిని పరవళ్లు.. భక్తజన కేరింతలు.. కలగలసి గోదారమ్మ తీరం కళకళలాడింది. వెతలు తీర్చే దేవేరి.. వేదమంటి జీవధార‡ చెంతకు వారాంతాన యాత్రికులు పోటెత్తారు. పుణ్యస్నానమాచరించి పులకించారు. తన్మయత్వంలో మునిగారు. పసుపు, కుంకుమతో గంగమ్మను అర్చించారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి తీరం శనివారం భక్తజన సందోహంతో నిండిపోయింది. అంత్యపుష్కరాల ఏడోరోజు భారీ సంఖ్యలో యాత్రికులు తరలివచ్చారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 65వేల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు అంచనా. తెల్లవారుజామునుంచే అన్ని ఘాట్లలోనూ రద్దీ నెలకొంది. గోదారి తీరాన భక్తులు ప్రణమిల్లారు. పసుపు, కుంకుమలతో గంగమ్మను అభిషేకించారు. పూర్వీకులకు పిండప్రదాన క్రతువులు నిర్వహించారు. గత ఏడురోజులుగా కొవ్వూరులో సుమారు లక్షన్నర మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారని అంచనా. ఒక్క శనివారమే 32 వేల మంది స్నానం చేశారని సమాచారం. శనివారం నరసాపురంలోనూ భక్తులు పోటెత్తారు. వలంధర్‌రేవులో మధ్యాహ్నం వరకూ భక్తుల రద్దీ తగ్గలేదు. శ్రావణమాసం రెండో రోజు కావడంతో యాత్రికుల సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. నరసాపురంలో సుమారు 20 వేల మందిపైనే స్నానాలు చేశారని అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా వలంధర్‌రేవులో ఏర్పాటు చేసిన జల్లుస్నానం చేయడానికి భక్తులు ఎక్కువ ఆసక్తి కనబరిచారు. గోదావరి వరద తీవ్రత కాస్త తగ్గడంతో కొవ్వూరు గోష్పాదక్షేత్రంలోని మొదటి, రెండు ఘాట్లలోనూ స్నానాలకు అధికారులు అనుమతించారు. శుక్రవారం వరద ఉధృతంగా ఉండడం వల్ల ఆ రేవులను మూసివేసిన సంగతి తెలిసిందే. వరద సమయంలో చేసిన రక్షణ ఏర్పాట్లను సడలించకపోవడంతో మెట్లపై తగిన నీరు లేక స్నానాలకు భక్తులు అవస్థలు పడ్డారు. అంత్యపుష్కరాల సందర్భంగా పలుచోట్ల గోదావరి మాతకు నిత్యహారతులు ఇస్తున్నారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో గోదావరి నీరాజన సమితి ఆధ్వర్యంలో పూజలు చేశారు. పట్టిసీమలో గోదావరి మాతకు గంగ పూజలు నిర్వహించారు. -
పుష్కర సిబ్బంది అవస్థలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి అంత్య పుష్కరాలపై ప్రత్యేక హోదా బంద్ ప్రభావం పడింది. ఉదయం నుంచి బస్సులు తిరగకపోవడంతో దూర ప్రాంత భక్తులు పుష్కర స్నానాలకు రాలేకపోయారు. పుష్కర çసమీపంలోని భక్తులు మాత్రమే రావడంతో ఘాట్లన్నీ బోసిపోయాయి.అంత్య పుష్కరాల్లో మూడో రోజైన మంగళవారం అమావాస్య కావడం కూడా భక్తుల సంఖ్య తగ్గడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఘాట్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో వారు ఇబ్బం దులు పడుతున్నారు. కనీసం అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలకు గురవుతున్నారు. పెనుగొండ మండలం సిద్ధాంతంలో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో గోదావరి మాతకు సంధ్యాహారతి ఇచ్చారు. పుష్కరాలు పూర్తయ్యే వరకూ ప్రతిరోజూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. -
జిల్లాలో 182 సారా రహిత గ్రామాలు
చింతలపూడి: జిల్లాలో 182 సారా రహిత గ్రామాలుగా గుర్తించినట్టు, జిల్లా మొత్తాన్ని సారా రహితంగా తీర్చిదిద్దేందుకు కషి చేస్తున్నట్టు ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ వైవీ భాస్కరరావు అన్నారు. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం 400 మంది విద్యార్థినులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, క్రీడా సామగ్రి అందజేశారు. నవోదయం కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే సారా తయారీదారులు, అమ్మకం దారుల్లో మార్పు తీసుకువచ్చామన్నారు. దీనిలో భాగంగా ఆయా గ్రామాల్లో సదస్సులు నిర్వహించి చైతన్యం తీసుకువస్తున్నామన్నారు. యువజన సంఘాలను గుర్తించి 230 వాలీబాల్ కిట్లు అందజేశామని చెప్పారు. ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకుడు గుంతలు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎక్సైజ్ సిబ్బంది సహకారంతో యువతకు పోటీ పరీక్షలకు అవసర మైన పుస్తకాలను అందజేస్తున్నామని చెప్పారు. కౌన్సెలింగ్ ద్వారా నల్లబెల్లం అమ్మకాలను అరికట్టామని తెలిపారు. సీఐ సత్యనారాయణ, ఎసై ్స అష్రఫున్నీసా బేగం, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ జి.భారతి, బ్రాహ్మణేశ్వరి, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
24న ఎస్బీఐ ‘ఎస్ఎంఈ సండే’
ఏలూరు (ఆర్ఆర్ పేట): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 24న ఎస్ఎంఈ సండే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు బ్యాంక్ రీజనల్ మేనేజర్ కె.రంగరాజన్ తెలిపారు. స్థానిక స్టేట్‌బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్టారు. ఎస్ఎంఈ సండే కార్యక్రమం ద్వారా రీజియన్ పరిధిలోని చిన్న, మధ్యతరగతి పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణ కోసం రుణాలు అందజేస్తామన్నారు. జిల్లాలో కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, చింతలపూడి, ఏలూరు మెయిన్ బ్రాంచ్‌తో పాటు 8 స్థానిక శాఖల్లో అదేరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బ్యాంకు సిబ్బంది పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉండి రుణాలు అందించడంలో సహకరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా రూ. 25 వేల నుంచి రూ. 25 కోట్ల వరకు రుణాలు అందించడానికి బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. 24న ఒక్కరోజే సుమారు రూ.40 కోట్లు రుణాలుగా అందించాలనే లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. రుణాలపై వడ్డీ 11 నుంచి 12.50 శాతం వసూలు చేస్తామని చెప్పారు. అనంతరం ఎస్ఎంఈ సండే ప్రచార రథాలను ప్రారంభించారు. మెయిన్ బ్రాంచ్ ఏజీఎం ఎంవీఎస్ ప్రసాద్, మార్కెటింగ్ హెడ్ ఎం.జోషి, చీఫ్ మేనేజర్ సీహెచ్ కిషోర్‌రెడ్డి, ఏలూరు రీజియన్ చీఫ్ మేనేజర్ ఏవీవీఎస్ రెడ్డి, జి.వెంకటేశ్వర్లు, ఎన్.శాంతి పాల్గొన్నారు. -
ప్రచారంలో ఆర్భాటం.. ఫలితాల్లో నిర్లక్ష్యం
ప్రభుత్వం ప్రచార ఆర్భాటంలో చూపించిన ఉత్సాహం ఆయా పథకాల అమలుకు వచ్చేసరికి చతికలపడుతోంది. భూసార పరీక్షలంటూ ఊరూవాడా విస్తృతంగా ప్రచారం చేసిన వ్యవసాయ శాఖ.. సార్వా పనులు ప్రారంభమై నెల కావస్తున్నా ఇప్పటికీ ఆ ఫలితాలను రైతులకు అందించలేదు. ఏయే ఎరువులు ఎంత మోతాదులో వేయాలన్న విషయంపై స్పష్టత కరువైంది. భీమవరం : భూసార పరీక్షల కోసం మట్టి నమూనాలు సేకరించి రెండున్నర నెలలు గడుస్తున్న ఇప్పటికీ ఆ ఫలితాలు రైతులకు చేరలేదు. దీంతో వారికి ప్రయోజనం లేకుండా పోయింది. సార్వా సీజన్ జిల్లాలో నెల క్రితమే ప్రారంభమైంది. చాలా వరకు నాట్లు కూడా పూర్తికావచ్చాయి. ఇప్పటికీ మట్టి నమూనాల ఫలితాలు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 72,452 నమూనాల సేకరణ ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధిస్తున్నా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, ధాన్యానికి గిట్టుబాటు ధర లభించకపోవడంతో వ్యవసాయమంటేనే రైతులు హడలెత్తిపోతున్నారు. వరి సాగులో అధిక ఖర్చులను తగ్గించడానికి ప్రభుత్వం భూసార పరీక్షలను నిర్వహించి దానికనుగుణంగా ఎరువులు వాడకం వల్ల ఖర్చు తగ్గించడంతో పాటు మరింత దిగుబడి సాధించవచ్చునని రైతులకు విస్తృతంగా ప్రచారం చేసింది. జిల్లాకు చెందిన మంత్రులతో పాటు ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు కూడా వేసవిలో ప్రకటనలతో ప్రచారాన్ని హోరెత్తించారు. దీంతో రైతులు గతంలో ఎన్నడూ లేనంతగా తమ భూముల్లో మట్టి నమూనాలు సేకరించి వ్యవసాయ అధికారులకు అందజేశారు. వరి, ఇతర పంటలకు సంబంధించి 56,226 నమూనాలు రాగా ఉద్యాన పంటలకు సంబంధించి 16,226 వచ్చాయి. మొత్తం 72,452 మట్టి నమూనాలు అధికారులకు అందజేశారు. డెల్టా ప్రాంతంలోని భీమవరం, నరసాపురం, ఆకివీడు వ్యవసాయ సబ్ డివిజన్స్ పరిధిలో సుమారు 6,921 మంది రైతుల నుంచి శాంపిల్స్ సేకరించారు. డెల్టాప్రాంతంలో 6.25 ఎకరాలు, మెట్టప్రాంతంలో 10 ఎకరాల పరి ధిలోని భూమికి ఒక శాంపిల్ చొప్పున సేకరించారు. భీమవరం డివిజన్లో 2,656 శాంపిల్స్, నరసాపురం డివిజన్ పరిధిలో 1,653 శాంపిల్స్, ఆకివీడు డివిజన్లో 2,602 శాంపిల్స్, పాలకొల్లు విడిజన్ పరి ధిలో 2,200 శాంపిల్స్ వ్యవసాయశాఖ సేకరించింది. గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ (జీఎస్పీ) ద్వారా శాంపిల్స్ నమోదు చేశారు. తాడేపల్లిగూడెం, భీమవరంలో పరీక్షలు గతంలో భూసార పరీక్షలు కేవలం తాడేపల్లిగూడెంలో మాత్రమే నిర్వహించగా ప్రస్తుతం పెద్ద మొత్తంలో పరీక్షలు నిర్వహించాల్సి ఉండడంతో భీమవరం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కూడా భూసార పరీక్షలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ నేలరంగు, స్వభావం, ఉదజని సూచిక, లవణ చూసిక వంటి వాటిని గుర్తించి పొటాష్, భాస్పరం వంటి వాటిని ఏ మోతాదులో వాడాలో తెలియచేస్తారు. ఇవి గాకుండా తాడేపల్లిగూడెం భూసార పరీక్షాకేంద్రం పరీక్షలు నిర్వహించి నత్రజని, సూక్ష్మపోషకాలు వంటి వాడకాన్ని తెలియచేస్తారు. భీమవరం వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో 2,656 శాంపిల్స్ సేకరించగా ఇప్పటివరకు 219 శాంపిల్స్ çఫలితాలు మాత్రమే అధికారులకు అందాయి. భూసార పరీక్ష ఫలితాలతో లాభాలు ఇవీ.. భూసార పరీక్షల నివేదికలు అందింతే ఆ భూమిలో ఏ పంట వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి? ఏ మేరకు యూరియా, భాస్పరం, డీఏపీ వంటి కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్‌ను ఏ మేరకు ఎంత మోతాదులో వేసుకోవాలో రైతులకు తెలుస్తుంది. దీంతో ఆయా పంటలు వేసుకోవడంతో పాటు ఎరువులను అవసరమైనే మోతాదులోనే వేసుకోవచ్చు. దీంతో రైతులకు ఆర్థికంగా లాభంతో పాటు పంట దిగుబడులు పెరుగుతాయి.