రేపటి నుంచి స్కూల్‌గేమ్స్‌ సెలెక్షన్స్‌ | form tommorow school games selections | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి స్కూల్‌గేమ్స్‌ సెలెక్షన్స్‌

Published Sat, Sep 10 2016 7:32 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

form tommorow school games selections

తణుకు: జాతీయ స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను ఈనెల 12 నుంచి పలు ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు జిల్లా స్కూల్‌గేమ్స్‌ సెక్రటరీ ఎ.సాయిశ్రీనివాస్‌ తెలిపారు. 12న ద్వారకాతిరుమల మండలం రాజాపంగిడిగూడెం జెడ్పీ హైస్కూల్‌లో విలువిద్య పోటీలు, 14న చాగల్లు జెడ్పీ హైస్కూల్‌లో వాలీబాల్‌ పోటీలు, 15న గోపన్నపాలెం సీతారామ ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో ఖోఖో, కబడ్డీ, హేండ్‌బాల్, టెన్నిస్, యోగా, అథ్లెటిక్స్‌ పోటీలు, 16న భీమవరం భారతీయ విద్యాభవన్స్‌లో హాకీ, రోప్‌స్కిప్పింగ్‌ పోటీలు, 17న ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో స్విమ్మింగ్, స్కేటింగ్, రోయింగ్, జూడో, తైక్వాండ్‌ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement