
న్యూఢిల్లీ: నిత్యావసరం, అత్యవసరం అంతకు మించి గుమ్మం దాటి బయటకు రావడానికే లేదు. ఇండియా మాత్రమే కాదు. అన్ని దేశాల పరిస్థితి ఇంతే. అయినా సరే బయటకు వచ్చే జనం వస్తూనే ఉన్నారు. అయితే లాక్‌డౌన్‌కి ముందు తర్వాత పరిస్థితుల్ని పోలుస్తూ గూగుల్ మ్యాప్స్ ప్రపంచ దేశాల్లో ఏయే ప్రాంతాల్లో ఎంత రద్దీ తగ్గిందో ఒక నివేదిక రూపొందించింది. భౌతిక దూరం నిబంధనలపై ఆరోగ్య శాఖ అధికారులకు ఉపయోగపడడం కోసం ఈ నివేదిక రూపొందించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారే అత్యధికులు కావడంతో ఇంటిపట్టున ఉండే వారి శాతం పెరిగింది. మిగిలిన అన్ని చోట్లా జనసమ్మర్థం సాధారణం కంటే 50 శాతానికిపైగా తగ్గింది.
మార్చి నెలాఖరు నాటికి భారత్‌లో జనసమ్మర్థం పరిస్థితి ఇలా ఉంది..