Published
Sat, Oct 8 2016 10:28 PM
| Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
సరస్వతీ.. నమస్తుభ్యం
శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా జిల్లాలోని అమ్మవార్లను శనివారం చదువుల తల్లి సరస్వతీ దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో సరస్వతీయాగాలు నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకువచ్చి దేవీ సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించారు. సరస్వతీ నమస్తుభ్యం.. వరదే కామరూపిణి.. ప్రార్థనలతో ఆలయ ప్రాంగణాలు దద్దరిల్లాయి.