సీల్ పిల్లని ఏమంటారు? | what we have to call seal child? | Sakshi
Sakshi News home page

సీల్ పిల్లని ఏమంటారు?

Published Sun, Dec 15 2013 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

సీల్  పిల్లని  ఏమంటారు?

సీల్ పిల్లని ఏమంటారు?

 అరణ్యం
   ప్రపంచంలో మొత్తం ముప్ఫై మూడు రకాల సీల్స్ ఉన్నాయి!
 
     జీవితంలో చాలాభాగం ఇవి నీటిలోనే గడుపుతాయి. పిల్లలకు జన్మనివ్వడానికి, చర్మం విడవాల్సినప్పుడు (సంవత్సరానికోసారి) మాత్రమే నేలమీద కాస్త ఎక్కువసేపు ఉంటాయి!
 
     ఆక్సిజన్‌ని పీల్చుకోవడం కోసం ఇవి ఒక్కోసారి రెండేసి గంటలపాటు ఊపిరి తీసుకోకుండా నీటి అడుగున నిశ్చలంగా ఉండిపోతాయి!
 
     నీటిలో అన్నీ స్పష్టంగా చూడగలిగే విధంగా వీటి కంటి నిర్మాణం ఉంటుంది!
 
      మగ సీల్‌ను ‘బుల్’, ఆడ సీల్‌ను ‘కౌ’ అంటారు. ఇవి సంవత్సరానికో బిడ్డను కంటాయి. ఈ పిల్లను పప్ అంటారు. పిల్లలను నెల రోజుల పాటు వాటిని సాకి, తరువాత స్వేచ్ఛగా వదిలేస్తాయి సీల్స్!
 
  వీటికి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. నీటిలో పడవో, ఓడో వెళ్తున్నప్పుడు, అదేంటో తెలుసుకోవాలని ఇవి చాలా సేపు ఫాలో అవుతాయట!
 
 ఆడ సీల్స్ వేరే గ్రూపుగా, మగవి వేరే గ్రూపుగా ఏర్పడి మరీ షికార్లు చేస్తాయి. మగ గ్రూపును పాడ్ అని, ఆడ గ్రూపును హారెమ్ అని అంటారు!
 
  వీటి చర్మం అడుగున ఒక మందమైన పొరలాగా కొవ్వు ఉంటుంది. దానివల్ల అవి ఎంతటి శీతలాన్నయినా తట్టుకోగలవు!
 
  ఇవి నీటిలో ఉండే వాటిని, నీటి ఉపరితలం మీద ఉన్నవాటిని ఒకేసారి స్పష్టంగా చూడగలుగుతాయట!
  సీల్స్ ప్రధాన ఆహారం చేపలు. కొన్ని కిలోమీటర్ల దూరంలో చేప ఉన్నా వీటికి తెలిసిపోతుంది. క్షణాల్లో వెళ్లి వాటిని పట్టేసేంత షార్ప్‌గా ఉంటాయి. తిండి కోసం వేయి అడుగుల లోతుకైనా వెళ్తాయి!
 
 సీల్స్ ఒంటి నుంచి తీసిన కొవ్వుతో నూనెను తయారు చేస్తారు. నల్ల సీల్ చర్మానికయితే ఎంతో డిమాండ్ ఉంది. దానితో బట్టలు తయారు చేస్తారు. వీటి కోసమే విపరీతంగా వేటాడటంతో... సీల్స్ సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది!
 
 రంగులు మార్చే పిట్ట!

స్కార్లెట్ ఇబిస్... ఈ ఎర్రటి విహంగం పేరు!
 
 ఇబిస్ పక్షులు అమెరికాలో ఉంటాయి. వీటిలో రెండే రెండు రకాలు ఉంటాయి. మొదటిది క్రెస్టెడ్ ఇబిస్. ఇది తెల్లగా ఉంటుంది. ఎంత తెలుపంటే... పాలు అంత! ఇక రెండోది స్కార్లెట్ ఇబిస్. ఇది ఎర్రగా ఉంటుంది. ఎంత ఎర్రగా అంటే... రక్తమంత!
 
 నిజానికి స్కార్లెట్ ఇబిస్‌లు పుట్టినప్పుడు ముదురు గోధుమరంగులో ఉంటాయట. కానీ ఎదిగేకొద్దీ ఆ రంగు వెలిసిపోయిన ట్టుగా అవుతుంది. తర్వాత వీపుమీద ఎర్రగా చిన్న మచ్చలా వస్తుందట. ఆపైన ఆ రంగు ఒళ్లంతా పాకి, చివరికిలా ఎర్రగా తయారవుతాయి. ఎర్రగా ఉండే పూలు, ఆకులు ఎక్కువగా తింటాయని, అందువల్లే వాటి శరీరం అలా అవుతోందని మొదట్లో అనుకునేవారు. కానీ వాటి జన్యువుల్లో వచ్చే మార్పుల కారణంగానే అలా తయారవుతున్నాయని పరిశోధకులు అన్నారు. అయితే అసలైన కారణం మాత్రం ఇంతవరకూ తెలియలేదు!
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement