ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీకి చెందిన కొత్త బీవైడీ అట్టో3 (BYD Atto 3) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సింగర్ జస్లీన్ రాయల్ అందుకున్నారు. బీవైడీ ఇండియా తాజాగా ఆమెకు ఈ ఎస్‌యూవీని డెలివరీ చేసింది. దీంతో బీవైడీ అట్టో3 కారును కలిగిన తొలి సెలబ్రిటీగా ఆమె మారారు.
సింగర్ జస్లీన్ రాయల్ గురించి చాలా మంది వినే ఉంటారు. అనేక అవార్డులు గెలుచుకున్న ఈమె సింగర్ మాత్రమే కాదు.. సాంగ్ రైటర్, కంపోజర్ కూడా. వివిధ భాషలలో బహుముఖ ప్రజ్ఞకు ప్రసిద్ధి చెంచారు. ఆమె సొంతంగా మ్యూజిక్ నేర్చుకుని వన్-వుమన్ బ్యాండ్ ప్రదర్శనతో కీర్తిని పొందారు. ఆమె రూపొందించిన హీరియే ఆల్బమ్ అత్యంత ఆదరణ పొందింది.
బీవైడీ అట్టో 3 ప్రత్యేకతలు
బీవైడీ అట్టో 3లో ఇటీవల పరిచయం చేసిన డైనమిక్, ప్రీమియం, సుపీరియర్ వేరియంట్‌లు ఈ ఎస్‌యూవీకి ఆదరణను మరింత పెంచాయి. ఈ ఎస్‌యూవీకి ఇప్పటివరకూ 600 లకు పైగా బుకింగ్స్ వచ్చాయి. ఇక ధర విషయానికి వస్తే డైనమిక్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 24.99 లక్షలు ఉంది. ప్రీమియం, సుపీరియర్ వేరియంట్‌లు 60.48 kWh బ్యాటరీ సామర్థ్యంతో 521 కి.మీ.(ARAI), 480 కి.మీ. (NEDC) రేంజ్ అందిస్తాయి. డైనమిక్ మోడల్ 49.92 kWh బ్యాటరీ సామర్థ్యంతో 468 కి.మీ. (ARAI), 410 కి.మీ. (NEDC) రేంజ్‌ని అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment