Jasleen Royal
-
అందమైన సింగర్.. అదిరేటి కార్!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీకి చెందిన కొత్త బీవైడీ అట్టో3 (BYD Atto 3) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సింగర్ జస్లీన్ రాయల్ అందుకున్నారు. బీవైడీ ఇండియా తాజాగా ఆమెకు ఈ ఎస్‌యూవీని డెలివరీ చేసింది. దీంతో బీవైడీ అట్టో3 కారును కలిగిన తొలి సెలబ్రిటీగా ఆమె మారారు.సింగర్ జస్లీన్ రాయల్ గురించి చాలా మంది వినే ఉంటారు. అనేక అవార్డులు గెలుచుకున్న ఈమె సింగర్ మాత్రమే కాదు.. సాంగ్ రైటర్, కంపోజర్ కూడా. వివిధ భాషలలో బహుముఖ ప్రజ్ఞకు ప్రసిద్ధి చెంచారు. ఆమె సొంతంగా మ్యూజిక్ నేర్చుకుని వన్-వుమన్ బ్యాండ్ ప్రదర్శనతో కీర్తిని పొందారు. ఆమె రూపొందించిన హీరియే ఆల్బమ్ అత్యంత ఆదరణ పొందింది.బీవైడీ అట్టో 3 ప్రత్యేకతలుబీవైడీ అట్టో 3లో ఇటీవల పరిచయం చేసిన డైనమిక్, ప్రీమియం, సుపీరియర్ వేరియంట్లు ఈ ఎస్‌యూవీకి ఆదరణను మరింత పెంచాయి. ఈ ఎస్‌యూవీకి ఇప్పటివరకూ 600 లకు పైగా బుకింగ్స్ వచ్చాయి. ఇక ధర విషయానికి వస్తే డైనమిక్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 24.99 లక్షలు ఉంది. ప్రీమియం, సుపీరియర్ వేరియంట్లు 60.48 kWh బ్యాటరీ సామర్థ్యంతో 521 కి.మీ.(ARAI), 480 కి.మీ. (NEDC) రేంజ్ అందిస్తాయి. డైనమిక్ మోడల్ 49.92 kWh బ్యాటరీ సామర్థ్యంతో 468 కి.మీ. (ARAI), 410 కి.మీ. (NEDC) రేంజ్‌ని అందిస్తుంది. -
Jasleen Royal: ఒకే సమయంలో.. ఎన్నో ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేసి.. వావ్!
న్యూ రిలీజ్ ‘అస్సీ సజ్నా’తో ప్రేక్షకులకు హాయ్ చెప్పింది సింగర్, సాంగ్ రైటర్, కంపోజర్ జస్లీన్ రాయల్. 2009లో ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ షోలో ఒకే సమయంలో ఎన్నో ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేసి వావ్ అనిపించింది. ఇండీ ఆర్టిస్ట్‌గా ప్రయాణంప్రారంభించిన రాయల్ బాలీవుడ్‌లోనూ తన టాలెంట్ నిరూపించుకుంది.‘నేనొక మ్యూజిక్ కంపోజర్‌ని. విత్ అవుట్ ఎనీ ట్రైనింగ్’ అంటుంది రాయల్. సంగీతంలో శిక్షణ తీసుకోనప్పటికీ ఆత్మన్యూనతకు మాత్రం ఎప్పుడూ లోనుకాలేదు. ‘యస్. నేను చేయగలను’ అంటూ స్వర విహారం చేస్తుంది. ‘ఐయామ్ బ్యాక్ టూ ది బేసిక్స్’ అంటూ తన ప్రయాణాన్ని పున:సమీక్షించుకుంటుంది రాయల్. ΄ాట హిట్ అయితే కాసేపు సంతోషించి ఆ సక్సెస్‌తో డిస్కనెక్ట్ అయ్యి ‘నెక్ట్స్‌ప్రాజెక్ట్’లోకి జంప్ చేయడం రాయల్ అనుసరిస్తున్న విధానం.‘ప్రతి ΄ాట నాకు ఎంతో ఇచ్చింది’ అంటున్న రాయల్ తన తాజా ΄ాట ‘అస్సీ సజ్నా’ గురించి ఏంచెబుతుంది? ఆమె మాటల్లోనే చె΄్పాలంటే... జీవితంతో ప్రేమలో పడేలా చేసే సాంగ్. జీవనోత్సాహాన్ని వెలిగించే సాంగ్. జీవితంలోని ఆనంద క్షణాలు గుర్తు తెచ్చుకొని ఆస్వాదించేలా చేసే సాంగ్. ‘బాధ నుంచి బయట పడేలా చేసే ΄ాట’ అంటుంది రాయల్. పెళ్లి ΄ాటల్లో తనదైన పేరు తెచ్చుకున్న రాయల్‌ను ‘పెళ్లి ΄ాటల మహారాణి’ అని పిలుస్తారు అభిమానులు.మ్యూజిక్ ఇన్స్రుస్టు్టమెంట్స్ గురించి రాయల్‌కు చిన్నప్పటి నుంచే ఆసక్తి. వాటిని ఎలా ప్లే చేయాలో నేర్చుకునేది. ఎప్పుడైనా మెలోడి తన బుర్రలోకి వస్తే....అది ఏదో ఒక ఇన్్రçస్టు్టమెంట్ మీద తీయగా పలికేది. బాలీవుడ్లో బంధువులు లేరు. గాడ్ ఫాదర్ లేరు. కేవలం తన మీద నమ్మకంతో పంజాబ్‌లోని లుథియానా నుంచి ముంబైకి వచ్చి సింగర్, కంపోజర్‌గా మంచి పేరు తెచ్చుకుంది జస్లీన్ రాయల్. -
పదహారు ప్రాయంలోనే సంగీత సు'స్వరా'యల్గా.. జస్లీన్ రాయల్
సుస్వరాయల్ పదహారు సంవత్సరాల వయసులోనే రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రూమెంట్స్ను ప్లే చేసే నైపుణ్యం జస్లీన్ రాయల్ సొంతం అయింది. ఆ తరువాత ఒకే సమయంలో మల్టీపుల్ మ్యూజిక్ ఇన్స్ట్రూమెంట్స్ ప్లే చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేది. ‘పంచి హో జవాన్’ సింగిల్‌తో సంగీత ప్రపంచంలో తనదైన పేరు తెచ్చుకుంది. ‘బార్ బార్ దేఖో’ (2015)తో బాలీవుడ్లో కంపోజర్‌గా బ్రేక్ వచ్చింది. ‘ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే మ్యూజిక్ కంపోజర్ అయ్యాను. నా మీద నాకు ఉన్న నమ్మకమే దీనికి కారణం. కాలేజీ రోజుల్లో అందరూ ప్లాన్ బీ గురించి ఆలోచిస్తున్న సమయంలో కూడా నా మార్గం మ్యూజిక్ మాత్రమే అనుకున్నాను. రియాల్టీ షోలో సెమీ–ఫైనల్స్ వరకు వెళ్లడం ద్వారా తొలిసారి గుర్తింపు లభించింది’ అంటున్న జస్లీన్‌కు మెలోడీలు అంటే ఇష్టం. ప్రయాణాలు అంటే ఇష్టం. ప్రయాణమార్గాలలో తట్టే ట్యూన్లను పాటలుగా మలచడం అంటే ఇష్టం. కంపోజర్, సింగర్ అయిన జస్లీన్ రాయల్ తన తొలి ప్రాధాన్యత కంపోజింగ్ మాత్రమే అంటుంది. (ఇవి చదవండి: 'సహస్రనామం' సమ్మోహన విజయం!) -
కమ్మని పాట పరిమళం!
సోనమ్ కపూర్ నటించిన ‘ఖూబ్సూరత్’ సినిమాతో గాయనిగా పరిచయమైన ఢిల్లీ అమ్మాయి జస్లీన్ రాయల్ గొంతు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ క్లాసులో ఉన్నప్పుడే పియానో వాయించింది జస్లీన్. అలా సంగీతం మీద ప్రేమ ఆమెతో పాటు పెరిగి పెద్దదవుతూ వచ్చింది. పద్నాలుగు సంవత్సరాల వయసులోనే పిల్లలకు ఆమె సంగీత పాఠాలు చెబుతుండేది. అందులో ఆమె వయసు పిల్లలు కూడా ఉండేవారంటే ఆశ్చర్యమే. పాఠాలు చెప్పగా వచ్చిన డబ్బుతో రకరకాల సంగీత పరికరాలు కొనుక్కునేది జస్లీన్. ‘‘మా కుటుంబసభ్యుల్లో సంగీత నేపథ్యం ఉన్నవారు లేరు. అయినా వారెప్పుడూ నన్ను నిరాశపరిచేవారు కాదు. నా అభిరుచిని ప్రోత్సహించేవారు. నేను ఆర్థికస్వాతంత్య్రానికి ప్రాధాన్యం ఇస్తాను. ఖర్చులకు ఎవరి మీదా ఆధారపడకుండా, నాకు అవసరమైన డబ్బును నేనే సమకూర్చుకునేదాన్ని’’ అంటోంది జస్లీన్. ఎం టీవిలో ప్రసారమైన ‘పంచీ హో జవాన్’ ఆల్బమ్‌తో ‘ఖూబ్సూరత్’లో పాడే అకాశం జస్లీన్‌కు వచ్చింది. ‘ఖుబ్సూరత్’లో జస్లీన్ పాడిన ‘ప్రీత్’ అనే పాట సోనమ్ కపూర్‌కూ, ఆమె సోదరి రియాకపూర్కూ తెగ నచ్చేసింది. ‘‘ఇది నా మనసు దోచిన పాట’’ అని ఇద్దరూ ట్వీట్ చేసి జస్లీన్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. పాపులర్ అయిన ఈ ‘ప్రీత్’ పాట పుణ్యమా అని మరికొన్ని సినిమాల్లో పాడే అవకాశాలు జస్లీన్ తలుపు తడుతున్నాయి. అయితే, ఎన్ని పాటలు పాడాం అని లెక్కలు వేసుకోవడం కన్నా, ఎన్ని మంచి పాటలు పాడాం అనేది ముఖ్యమని నమ్ముతోంది ఈ కొత్త గాయని. ‘‘కొన్ని పాటలు వింటున్నప్పుడు సూటిగా హృదయాన్ని తాకినట్లు అనిపిస్తుంది. పాడిన వారి దగ్గరికి వెళ్లి, ‘ఎంత బాగా పాడారు...’ అని ప్రశంసించాలనిపిస్తుంది’’ అంటోంది జస్లీన్. నిజానికి ఆమె ‘ఖూబ్సూరత్’ చిత్రంలో పాడిన పాట విని చాలామంది ‘ఇంత అందమైన పాట పాడింది ఎవరు?’ అని ఆరా తీశారు. అది ఆమె తొలి విజయమే కదా!